Kalki 2898 AD : ట్రేడ్ కి వణుకు పుట్టిస్తున్న ప్రభాస్ ‘కల్కి 2898 AD’..ఆ ఒక్క చోటే 75 కోట్లు డిమాండ్..
రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి దక్కిన అసలు సిసలైన విజయం ఇదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది. ప్రభాస్ ని ఎలా చూస్తూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారో అలాగే చూపించారు.
ఈ సమ్మర్ లో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేపట్టనున్నాడు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఎడి చిత్రం మే 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో ప్రతి అంశం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో టైం ట్రావెల్ మూవీ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకి తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Kalki 2898 AD :నైజాం ధియేట్రికల్ హక్కులు 75 కోట్లు..
తాజా సమాచారం మేరకు కేవలం నైజాం ఏరియా విషయంలో మైండ్ బ్లోయింగ్ డీల్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం నైజాం ధియేట్రికల్ హక్కులు మాత్రమే 75 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ఆల్మోస్ట్ క్లోజ్ అని అంటున్నారు. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ 200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ తో ఫైట్ చేయించిన మారుతి.. ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ మాములుగా లేవుగా..
ఒక్క నైజాం ఏరియాలోని 75 కోట్లు అంటే మాటలు కాదు. 75 కోట్లు అంటే టాలీవుడ్ లో స్టార్ హీరోల హిట్ చిత్రాల యావరేజ్ అమౌంట్ అని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఈ చిత్రంతో గ్లోబల్ స్థాయికి ఎదగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Discussion about this post