Mahesh Babu : మహేష్ బాబుకి ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ యాడ్స్, సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ తో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా అమ్మాయిల్లో ఆయన క్రేజ్ మాములుగా ఉండదు. సామాన్యులే కాదు సెలబ్రిటీల్లో సైతం ఆయనకు ఆభిమానులున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటాడు సూపర్ స్టార్. ఇటీవల మహేష్ పేద పిల్లలకు వైద్యాన్ని అందించే ‘Heal a Child’ అనే ఓ ఎన్జీఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం మూవీలో నటిస్తుండగా.. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో SSMB29 లో నటించనున్నాడు. దీనికి సంబంధించిన కసరత్తులు అప్పుడే ప్రారంభించాడు సూపర్ స్టార్. అయితే మహేష్ బాబు సినిమాల్లో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ ఉవ్విళ్లూరుతుంటారు. ఆయనంటే ఇష్టం, క్రష్ అనే పలువురు హీరోయిన్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే మరో అమ్మడు తన మనసులో మాట బయట పెట్టింది.
Allu Arjun : ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి అల్లు అర్జున్ ప్రత్యేక పూజలు..
ఆమె ఎవరో కాదు తెలుగువారు సీత అంటూ ముద్దుగా పిలుచుకునే మృణాల్ ఠాకూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలనేది డ్రీం అని, అలానే తాను ఆ రోజు కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది మృణాల్. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మృణాల్ కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ నాని30 పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మరో మూవీలో నటిస్తుంది.