Megastar Viswambhara Movie : విశ్వంభర లో యంగ్ హీరోయిన్..
ఆచార్య తో కెరీర్ లోనే దారుణమైన పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.ఈసినిమా చిరుకి బాగానే డ్యామేజ్ చేసింది.అయితే ఆచార్య ఇచ్చిన అనుభవాన్ని మర్చిపోయేలా చేసింది వాల్తేరు వీరయ్య.గత ఏడాది సంక్రాంతికి వచ్చినా ఈసినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.దాదాపు 200 కోట్లకుపైగా వసూళ్లతో అదరగొట్టింది. బాబీ డైరెక్ట్ చేయగా రవితేజ కీలక పాత్రలో కనిపించాడు.ఇక అంతా సెట్ అనుకున్న టైంలో భోళా శంకర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు చిరు.దీనికి డైరెక్ట్ మెహర్ రమేష్ కావడంతో ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు.
ఇక ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.గత ఏడాది ఆగస్టు లో విడుదలైన ఈసినిమా ఆచార్య లెవెల్ డిజాస్టర్ అయ్యింది.ఈసినిమా ఇచ్చిన షాక్ వల్ల కాస్త బ్రేక్ తీసుకొని చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టాడు అదే విశ్వంభర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో వస్తుంది ఈసినిమా.టైటిల్ అనౌన్స్ మెంట్ టైం లో ఓ వీడియో ను విడుదలచేయగా అది సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ముఖ్యంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.
విశ్వంభరలో చిరంజీవి డిఫ్రెంట్ లుక్ లో కనిపించనుండగా త్రిష హీరోయిన్ గా చేస్తుంది.ఇటీవలే షూటింగ్ లోకూడా పాల్గొంది.ఇక ఇప్పుడు ఈసినిమాలో ఓ కీలక పాత్ర కోసం యంగ్ హీరోయిన్ సురభిని తీసుకున్నారట.ఈసినిమాలో తను ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది సురభి. తెలుగులో చివరగా శశి అనే సినిమాలో సురభి హీరోయిన్ గా చేసింది అయితే ఈసినిమా భారీ ప్లాప్ కావడం తో అవకాశాలు తగ్గిపోయాయి.మరి విశ్వంభర తరువాత మళ్ళీ ఆమె తెలుగులో బిజీ అవుతుందో చూడాలి.
Megastar Viswambhara Movie Release Date :
విశ్వంభరకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.అప్పుడే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈసినిమా విడుదలకానుంది. మొత్తానికి మంచి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నారు మేకర్స్. కంటెంట్ ఉంటే మాత్రం ఈసినిమా చిరుకి మరో వాల్తేరు వీరయ్య కావడం ఖాయం.
Gopichand Bheema : భీమా ట్రైలర్ వచ్చేస్తుంది..!! ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొని వరుస సక్సెస్ లు చూశాడు హీరో గోపిచంద్. లక్ష్యం ,యజ్ఞం...
Discussion about this post