Nitin Extra Ordinary Man : నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ టీజర్ ఎలా ఉంది..?
: 2020 లో వచ్చిన భీష్మ తర్వాత హీరోని నితిన్ కి సరైన సినిమా పడలేదు.. వరుసగా చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలు నిరుత్సాహపరిచాయి. అయితే ఇప్పుడు “ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్” అంటూ.. ఒక డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
నిన్ననే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ నితిన్ కు మరో హిట్ అందించేటట్లే ఉంది. దర్శకుడు వక్కంతం వంశీ కంప్లీట్ ఫన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ ఈ సినిమాని మలచినట్లు కనిపిస్తుంది. ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. టీజర్ లో సీన్స్ మాత్రం హిలేరియస్ గా ఉన్నాయి. నితిన్ కి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆద్యంతం ఫన్నీగా హుషారుగా సాగిన టీజర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి..
Chandrababu Bail : న్యాయం గెలవడం కాదు.. అనారోగ్యం కాపాడింది..!!