Prabhas Ram Charan : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో చిత్రబృందం పాల్గొని సినిమా టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ సినిమాలపై పలు విమర్శలు వచ్చాయి. ఆదిపురుష్ కథ, సలార్‌లో కనిపించిన ప్రభాస్ లుక్, ప్రాజెక్ట్ కె సినిమా మొదటి పోస్టర్.. ఇలా పలు విషయాల్లో

ఎన్ని వివాదాలు వచ్చినా ఇప్పటి వరకు ప్రభాస్ ఎక్కడా నోరు విప్పలేదు. తాజాగా కల్కి సినిమా కార్యక్రమంలో రాజమౌళి, రామ్ చరణ్‌ల గురించి ప్రభాస్ తొలిసారి మాట్లాడాడు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. భారత్ లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’ చాలా గొప్ప సినిమా. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం ఆనందాన్నిచ్చింది. భారతదేశానికి దక్కిన గౌరవంగా భావించాం. రాజమౌళి దానికి అర్హుడు అంటూ ప్రశంసించగా..
Annapurna Photo Studio Movie Review : ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ రివ్యూ & రేటింగ్
రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చెర్రీ నాకు మంచి ఫ్రెండ్. ఏదో ఒకరోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అటు డార్లింగ్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, చెర్రీల కాంబినేషన్లో సినిమా వస్తే టాలీవుడ్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. చూడాలి ఈ ప్రాజెక్ట్ కి ఎవరు, ఎప్పుడు శ్రీకారం చూడతారో..
Mahesh Babu : మహేష్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో..