Mahesh Babu : టాలీవుడ్ హీరోలందరూ ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు ప్యాన్ ఇండియా మూవీ మొదలు పెట్టనేలేదు. టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్ విషయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ ఇలా ఎప్పుడూ ఈ పేర్లు దోబూచులాడినా.. కరెక్ట్ గా ఎవరు టాలీవుడ్ నెంబర్ 1 అనేది చెప్పలేకపోయేవారు. కానీ ఇప్పుడు మహేష్ తెలుగులో అందుకుంటున్న పారితోషకం చూస్తుంటే మహేషే నెంబర్ 1 అనాల్సి వస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న హీరోలందరూ కూడా ఒక్కో

సినిమాకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా ఒక్కో సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడంటూ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Allu Arjun Pushpa 2 Dialogue : చిరు లీక్స్ కన్నా డేంజరిది..
మహేష్ బాబు సినిమాలు రెండు రాష్ట్రాలకే పరిమితమైన రెమ్యూనరేషన్ మాత్రం భారీగా ఉందని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు జీఎస్టీతో కలిపి ఈ సినిమాకు రూ.78కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కాకపోయినప్పటికీ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదంటూ చర్చ జరుగుతోంది. రూ.200 కోట్ల బడ్జెట్ తో గుంటూరు కారం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
BRO Censor Talk : పవన్ ‘బ్రో’ సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..