Ram Charan : RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబర్ స్టార్ అయ్యాడు. ట్రిపుల్ ఆర్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులకు పాప పుట్టడంతో షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన చెర్రీ త్వరలో షూటింగ్ లో బిజీ కానున్నాడు. అయితే చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అయ్యాడు.

బుచ్చిబాబు మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఆ మధ్య చరణ్ RC16 గురించి చరణ్ మాట్లాడుతూ రంగస్థలానికి మించి ఉంటుంది అనడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ మూవీ హాలీవుడ్ వర్షన్ కూడా ప్లానింగ్ లో ఉందట. RRRతో హాలీవుడ్ లో చరణ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Varahi Vijaya Yatra : పవన్ రెండోదశ వారాహి విజయయాత్రకు ముహూర్తం ఫిక్స్..
ఇందులో హీరో స్పోర్ట్స్ మ్యాన్. చిన్న గ్రామం నుంచి మొదలైన అతని ప్రస్థానం అంతర్జాతీయంగా తీసుకెళ్లాలనుకుంటాడట. కానీ, దానికి విలన్ అడ్డుపడటంతో హీరో ఆటల్లో పాల్గొన్నప్పుడు ఓ అవయవాన్ని కోల్పోతాడట. అయినప్పటికీ హీరో పట్టు వదలకుండా.. తన ఆశయాన్నీ సాధించడానికి మరో కొత్త జట్టును తయారు చేసి.. వారు అంతర్జాతీయ స్థాయిలో కప్ ఎలా సాధించారు అనేదే RC16 కథ. కాగా మూవీ మధ్యలో రామ్ చరణ్ హ్యాండీక్యాప్డ్ నటించనున్నట్లు తెలుస్తోంది.