Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుపోతున్నాడు. రీసెంట్ గా విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు 100కోట్ల క్లబ్ లో చేరాడు తేజ్. ప్రస్తుతం ఈ సుప్రీం హీరో మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీలో నటించాడు.

ఈ మూవీకి సముద్రఖని డైరెక్టర్ తో పాటు ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. జులై 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ సక్సెస్ కావాలని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, శ్రీకాళహస్తిలో సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రత్యేక పూజ వివాదస్పదమవుతోంది.
Varahi VijayaYathra in Tanuku : తణుకు చేరిన వారాహి విజయయాత్ర..
పూజ సమయంలో శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సాయి ధరమ్ తేజ్ స్వయంగా దేవుడికి హారతులిచ్చాడు. దీనిపై వివాదం నెలకొంది. భక్తులు నేరుగా దేవుడికి హారతులివ్వడం విరుద్ధమని పండితుల మండిపడుతున్నారు. అయితే ఈ వివాదంపై సాయి ధరమ్ తేజ్ ఇంకా స్పందించలేదు. ఇదిలావుండగా ఇద్దరు మెగా ఒకే స్క్రీన్ పై కనిపించనుండడంతో బిగ్ స్క్రీన్ పై మామ అల్లుళ్లను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
RC16 Heroine : రామ్ చరణ్ RC16కు హీరోయిన్ ఫైనల్..