RC16 Heroine : RRR తర్వాత రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. అప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన చెర్రీ RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రెసెంట్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ మూవీ షూట్ ప్రారంభమైంది. ఇందులో కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లు కాగా చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇక ఈ మూవీ తర్వాత చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 లో నటించనున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించనున్నాడు. చిన్న గ్రామం నుంచి మొదలైన అతని ప్రస్థానం అంతర్జాతీయంగా తీసుకెళ్లాలనుకుంటాడట. ఏదేమైనా ఈ మూవీ రంగస్థలం మూవీని మించి ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Baby Movie Review : ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ రివ్యూ & రేటింగ్..
ఇదిలావుండగా ఈ మూవీలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. మృణాల్ ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీలో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఓ చిత్రాన్ని చేస్తుంది. అయితే రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
Mahaveerudu Movie Review: శివకార్తికేయన్ ‘మహావీరుడు’ మూవీ రివ్యూ & రేటింగ్..