Samantha Old Tweet : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నార్త్ లో క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది సామ్. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు యశోద, శాకుంతలంతో ఆకట్టుకోగా.. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషీలో నటిస్తుంది. ఈ మూవీని లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శివ నిర్వణ డైరెక్ట్ చేస్తుండగా
ఈ మూవీ నుంచి ఆ మధ్య రిలీజ్ అయిన నా రోజా నువ్వే సాంగ్ రికార్డులు క్రియేట్ చేయగా తాజాగా ఆరాధ్య సాంగ్ రిలీజ్ అయ్యింది. దీంతో అది చూసిన నెటిజన్లు సామ్ ని ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం గతంలో సామ్ చేసిన ట్వీట్.. విషయం ఏంటంటే.. సుకుమార్ డైరెక్షన్ లో 2014లో మహేష్ బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ పై సామ్ ఒకప్పుడు ఓ ట్వీట్ షేర్ చేసింది. అదేంటంటే.. ” ఇంకా రిలీజ్ అవ్వని ఓ మూవీ పోస్టర్ చూశాను. అది చూడగానే నా మనోభావాలు దెబ్బతిన్నాయి” అంటూ రాసుకొచ్చింది.
Urvashi Rautela Hot Pics : బ్రో బ్యూటీ హాట్ పిక్స్.
అందులో మహేష్ బాబు బీచ్ లో నడుస్తుండగా.. ఆయన వెనకే హీరోయిన్ ఆయన మోకాలి మీద పాకుతూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఖుషి సెకండ్ సింగిల్ ఆరాధ్య సాంగ్ లో కూడా విజయ్, సమంత చేతిపై కాలు పెట్టి కనిపించాడు. దీంతో ఆ పోస్టర్ ను ఖుషి పోస్టర్ ను పక్కన పెట్టి కొంతమంది నెటిజన్లు కర్మ రివర్స్ అయిందంటూ సామ్ ను. టార్గెట్ చేసి తిడుతున్నారు. మరికొంత మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. మహేష్ పిక్ లో హీరోయిన్ బానిసలా ఉండగా.. విజయ్ పిక్ లో భార్యభర్తల ఉందంటూ సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఖుషి మూవీని సెప్టెంబర్ 1 విడుదల కానుంది.
https://twitter.com/Nikhil_Prince01/status/1679114030412333056?t=qJruUyVKt8m1rqWT5_cCCw&s=19