Sivaji : ఒకప్పుడు పలు ప్రేమ మరియు కుటుంబ తరహా చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మన తెలుగు హీరో శివాజీ గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే హీరో శివాజీ కేవలం హీరోగా మాత్రమే కాకుండా గెస్ట్ అప్పియయరెన్స్ మరియు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించి బాగానే ఆకట్టుకున్నాడు. ఇక సినిమాల్లో హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయాల్లో అనుకున్నంతగా సక్సస్ కాలేకపోయారు. దీంతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దామవుతున్నారు హీరో శివాజీ.
ఎడిటర్ గా పని చేశా.
అయితే చాలామందికి శివాజీ హీరోగా మాత్రమే తెలుసు. కానీ శివాజీ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన కొత్తలో కొన్ని రోజులపాటూ ఎడిటింగ్ విభాగంలో పని చేశారనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కాగా ఈ విషయం గురించి ఇటీవలే హీరో శివాజీ ఓ ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు.
ఇందులో భాగంగా తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రముఖ కే. ఎస్ రామారావు గారి దగ్గర ఎడిటర్ గా పని చేశానని ఆ సమయంలో తనకి రూ.800 జీతం ఇచ్చేవారని తెలిపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రముఖ సీరియల్ దర్శకురాలు మంజుlలా నాయుడిగారి దగ్గర ఎడిటర్ గా పని చేశానని ఈ క్రమంలో తనకి రూ. 5000 జీతంతో పాటూ బేటాలు అదనంగా ఉండేవని చెప్పుకొచ్చాడు. తాను సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో ఇబ్బందులు ఎదుర్కున్నానని కానీ కొద్ది రోజుల తర్వాత సమస్యలు అదిగమించి హీరోగా ఎదిగానని ఎమోషనల్ అయ్యారు.

Pawan Kalyan’s Strategy in Allotment of Seats : సీట్ల కేటాయింపులో పవన్ కళ్యాణ్ మర్మం ఇదే..!!
బిగ్ బాస్ లో కంటెస్టెంట్
ఈ విషయం ఇలా ఉండగా తెలుగు ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 7వ సీజన్లో కూడా శివాజీ కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగానే అలరించాడు. కాగా ఇటీవలే హీరో శివాజీ ‘నైన్టీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’వెబ్‌సిరీస్ లో మెయిన్ లీడ్ పాత్రలో నటించాడు. ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
నైన్టీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్
ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఒకరకంగా ‘నైన్టీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’వెబ్‌సిరీస్ హీరో శివాజీ కి మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి హీరో శివాజీ ఇలాగే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతారో లేక మళ్ళీ రాజకీయాల్లోకి వెళతాడో చూడాలి.