The Kerala Story OTT Release : వివాదాల నేపథ్యంలో విడుదలైన ది కేరళ స్టోరి చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది. చిన్న బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలతో ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా కాస్త రాజకీయరంగును పులుముకొని భారీ వివాదానికి తెరలేపింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
![The Kerala Story OTT Release : కాంట్రావరీ అండ్ సెన్సేషనల్ మూవీ "ది కేరళ స్టోరీ".. ఇంకా ఓటీటీలోకి ఎందుకు రాలేదంటే.. 20 Suma Kanakala](https://b3486977.smushcdn.com/3486977/wp-content/uploads/2023/07/images-2023-07-20T134554.158.jpeg?lossy=2&strip=1&webp=1)
![The Kerala Story OTT Release : కాంట్రావరీ అండ్ సెన్సేషనల్ మూవీ "ది కేరళ స్టోరీ".. ఇంకా ఓటీటీలోకి ఎందుకు రాలేదంటే.. 20 Suma Kanakala](https://b3486977.smushcdn.com/3486977/wp-content/uploads/2023/07/images-2023-07-20T134554.158.jpeg?lossy=2&strip=1&webp=1)
డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే వివాదాల నేపథ్యంలో ఏ ఓటీటీ కంపెనీ గానీ, టీవీ ఛానెళ్లు గానీ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయలేదని చిత్ర నిర్మాత విపుల్ షా ఆ మధ్య చెప్పుకొచ్చాడు. కానీ తాజా సమాచారం ప్రకారం.. డిజిటల్, శాటిలైట్ హక్కులను విక్రయించడానికి
Netflix Password Sharing : యూజర్స్ కి షాక్ ఇచ్చిన Netflix..
నిర్మాత విపుల్ షా రూ. 75 నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారట. దీంతో ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు, టీవీ కంపెనీలు రైట్స్ కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదట. నిర్మాత రేటు విషయంలో ఏ మాత్రం తగ్గించినా కొనుగోలు చేయడానికి ఆన్లైన్ ప్లాట్ ఫామ్లు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మతమార్పిడులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.240 కోట్లు వసూలు చేసింది.
Vaishnavi Chaitanya : బేబీ లో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి వైష్ణవిని ఎలా ఒప్పించారో తెలుసా..!?