Tillu Square OTT : టిల్లు స్క్వేర్ ఓటీటీ రేటు చుస్తే షాక్ అవ్వాల్సిందే..
డీజే టిల్లుకు యూత్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఈసినిమాతో హీరో సిద్దు జొన్నలగడ్డ ఓవర్నైట్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టోరీ పక్కన పెడితే సిద్దు బాడీ లాంగ్వేజ్ ,డైలాగ్ డెలివరీ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఇక ఈసినిమా ఇచ్చిన ఉత్సహంతో సీక్వెల్ కూడా తీశారు. అదే టిల్లు స్క్వేర్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది.
ఈసినిమా నుండి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసీక్వెల్, డీజే టిల్లు కు మించి వుండనుందని చెప్పేశారు. సినిమాలో హీరోయిన్ మాత్రం మారింది. ఈసారి అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నారు.ట్రైలర్ లో అనుపమా రెచ్చిపోయి కనిపించింది. ఇక రిలీజ్ కు ఇంకా నెలకు పైగా సమయం వున్నా ట్రైలర్ రిలీజ్ చేయగా ఈప్లాన్ నిర్మాతలకు భారీగానే వర్కౌట్ అయ్యిందట.
ఈసినిమా బిజినెస్ ఊహించని లెవెల్లో జరుగుతుందట. నాన్ థియేట్రికల్ బిజినెస్ అయితే షాక్ ఇస్తుంది. ఈసినిమా ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ డీల్ 35కోట్లుకు ఓకే అయ్యిందట.
ఓ మీడియం రేంజ్ హీరో సినిమా ఇంత భారీ రేటు పలకడం ఇదే మొదటి సారి.సాంగ్స్ హిట్ అవ్వడం,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం వీటికి తోడు అనుపమా లిప్ లాక్ లతో రెచ్చిపోవడంతో నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఇవ్వడానికి వెనుకడుగు వేయలేదట.ఒకవేళ ఇది నిజమైతే నాన్ థియేట్రికల్ తోనే నిర్మాతకు లాభాలు వచ్చినట్లే.ఇక థియేట్రికల్ ,శాటిలైట్ ఇలా అన్ని బోనస్ కానున్నాయి.మొత్తానికి టిల్లు స్క్వేర్ నిర్మాతలకు జాక్ పాట్ కానుంది.మరి రిలీజ్ కు ముందే సెన్సేషన్ సృష్టిస్తున్న ఈసినిమా రిలీజ్ తరువాత ఏం చేస్తుందో చూడాలి.
మల్లిక్ రామ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య,నాగవంశీ ఈసినిమాను నిర్మిస్తున్నారు.మార్చి 29న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
Tillu Square OTT : Anupama Parameswaran Latest Pics
Discussion about this post