Venki Anil Ravipudi Movie :వెంకీ -అనిల్ రావిపూడి సినిమాకు హీరోయిన్ దొరికేసింది ?
సంక్రాంతికి సైంధవ్ తో వచ్చి భారీ డిజాస్టర్ ను చవి చూశాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.దీనికి కన్నా ముందు ఎఫ్ 3 తో బ్లాక్ బాస్టర్ కొట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి సైంధవ్ తో వచ్చాడు.అయితే ఈసినిమా తనకు ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది.హిట్ ఫేమ్ శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.అదేంటో ఈసినిమా ఓటిటి లో వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు.పైగా ఇది వెంకీ కి 75వ సినిమా.మొత్తానికి ఈసినిమా విషయంలో దారుణంగా దెబ్బతినడంతో వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
వామ్మో ఇదేం లుక్కు బాబోయ్.. షాకింగ్ గెటప్ లో మంచు లక్ష్మి, లేటెస్ట్ ఫొటోస్
అందులో భాగంగా తనకు ఎఫ్ 2,ఎఫ్3 లతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ లను ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.వెంకటేష్ కోసం రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథ ను సిద్ధం చేశాడట అనిల్.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.ఇక ఈసినిమాలో హీరోయిన్ ను కూడా లాక్ చేశారని సమాచారం.ఈసినిమా కోసం త్రిష ను హీరోయిన్గా తీసుకోనున్నారట త్వరలోనే ఈవిషయంలో కూడా క్లారిటీ రానుంది.
Venki Anil Ravipudi Movie : వెంకటేష్ ,త్రిష కలిసి నాలుగోసారి..?
ఒకవేళ అదే గనుక నిజమైతే వెంకటేష్ ,త్రిష కలిసి నటించడం నాలుగో సారి కానుంది.ఇంతకుముందు వీరిద్దరూ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ,నమో… వెంకటేశ,బాడీగార్డ్ సినిమాల్లో నటించారు.ఇక అటు వరస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు అనిల్ రావిపూడి.గత ఏడాది బాలకృష్ణ తో భగవంత్ కేసరి తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు దాంతో ఈసారి కూడా వెంకీ,అనిల్ నే నమ్ముకున్నాడు.మరి రావిపూడి,వెంకటేష్ కు హ్యాట్రిక్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక వెంకటేష్ చేతిలో ఓ వెబ్ సిరీస్ కూడా వుంది.అదే రానా నాయిడు సీజన్ 2.అయితే ఫస్ట్ సీజన్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వెంకీ సెకండ్ సీజన్ విషయం లో మాత్రం అలా జరుగకుండా చూసుకుంటున్నాడట.
Discussion about this post