Lokesh Vs Roja : లోకేష్ vs రోజా… లోకేష్ యువగళo పాదయాత్ర మొదలుపెట్టి నాలుగు రోజులు కావస్తున్నా టీడీపీ ని ముందుకు తీసుకెళ్లే సత్తా లేదని బయట వినిపిస్తున్న మాట. టిడిపి, వైసిపి ల మధ్య మాటల యుద్ధం రోజా వర్సెస్ లోకేష్ అన్నట్లు ఉంది. ఒకప్పుడు రోజా “సొంతంగా ఎలక్షన్లో పోటీకి రాలేని, కొడుకుని గెలిపించుకోలేని చంద్రబాబు చీర కావాలా, చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి” అన్నమాటలకు దీటుగా కౌంటర్ ఇచ్చాడు నారా చంద్రబాబు తనయుడు లోకేష్..
పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగంలో రోజా ని డైమండ్ రాణి అన్న పదాన్ని అందుకని రోజా అన్న మాటలకి డైమండ్ పాప అంటూ.. మహిళా మంత్రి అయుండి “చేతికి గాజులు వేసుకున్న వాళ్ళు చీర కట్టుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళా..? పంపించు.. నా తోబుట్టువులకి, తెలుగింటి ఆడపడుచులకు పెట్టి కాళ్ళు మొక్కుతా, అంతేగానీ మీ నాయకుడు లాగా తల్లి, చెల్లిని మెడబెట్టి బయట గెంటను” అని కామెంట్ చేశారు.
Also Read: పూజ చేసేప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!
దీనికి రోజా స్పందిస్తూ… “లోకేష్ ను వార్డ్ మెంబర్ కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ.. ఏ విధంగా పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలి ? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేస్ గురించి ప్రశ్నించినందుకు రూల్స్ విరుద్ధంగా సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేశారంటూ, ఆడవాళ్లకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ఘాటుగా స్పందించారు. లోకేష్ కు అసలు పదాలే పలకడం రాదు అంటూ ఐరన్ లెగ్, ఇలాంటి వాడిని పులకేష్ అనక ఏమంటారు అని కౌంటర్ ఇచ్చారు. “ఇలా ఉంది అధికార ప్రతిపక్షాల రాజకీయం.. వీళ్ళకా మేము ఓట్లు వేసింది అంటూ సమాన్యజనం వీళ్ళ మాటలు చూసి తల కొట్టుకుంటున్నారు..
