• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Reviews

Annapurna Photo Studio Movie Review : ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ రివ్యూ & రేటింగ్

R Tejaswi by R Tejaswi
July 21, 2023
in Reviews
0 0
0
Annapurna Photo Studio Movie Review : ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ రివ్యూ & రేటింగ్
Spread the love

Annapurna Photo Studio Movie Review : నటీనటులు: చైతన్య రావు, లావణ్య సాహుకార, లలిత్ ఆదిత్య, వివా రాఘవ, ఉత్తర రెడ్డి, మిహిర గురుపాదప్ప, యష్ రంగినేని, వాసు ఇంటూరి, కృష్ణ మోహన్, రమణ

దర్శకుడు : చందు ముద్దు
నిర్మాత: యష్ రంగినేని
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో మంచి ఫేం అందుకున్న చైతన్య రావ్, యూట్యూబ్ వీడియోలతో పాటు హిట్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించగా ఒక పిట్ట కథ లాంటి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం..

కథ :
1980 దశకం అది. గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊళ్లో చంటి (చైతన్య రావ్) తన స్నేహితుడితో కలిసి తల్లి పేరు మీద అన్నపూర్ణ ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. జ్యోతిష్యుడైన తన తండ్రికి చుట్టు పక్కల ఎంతో మంచి పేరు. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. స్నేహితులంతా ఎగతాళి చేస్తుంటారు. ఇంతలోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్టపడుతుంది.

Allu Arjun Pushpa 2 Dialogue : చిరు లీక్స్ కన్నా డేంజరిది..

ఇక ఈ ఇద్దరి ప్రేమకథ కంచికి చేరినట్టే అనుకునేలోపే విషయం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌతమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చంటి ఓ హత్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నించాడు? ఇంతకీ చంటి, గౌతమి ఒక్కటయ్యారా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
80వ దశంలో కథ కాబట్టి దానికి తగినట్లు చక్కటి గ్రామాన్ని ఎంపికచేసుకున్నాడు దర్శకుడు. గతంలో పెద్ద వంశీచిత్రాలు వచ్చాయి. గ్యాప్‌ చాలా వుండడంతో ఆ తరహాలో దర్శకుడు చెందు వెళ్ళాడు. ఇందులో హీరోకు వయస్సు వచ్చినా పెండ్లికాదు అనే పాయింట్‌ సరికొత్తగా అనిపిస్తుంది. అలా ఎందుకనేది ముగింపు దాకా తీసుకువచ్చి సస్పెన్స్‌లో పెట్టాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ ఇస్తాయి.

Mahesh Babu : మహేష్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో..

హీరోయిన్‌ను చూడగానే రంగమ్మ అనే సాంగ్‌ రావడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అది పూర్తినిడివి సాంగ్‌ లేకపోవడంతో కొంత ఆడియన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ఇద్దరూ కొత్తవారు కావడం అప్పుడే చిగురించిన పువ్వులా లావణ్య పాత్ర అందంగా వుంటుంది. వయస్సు మీద పడినా హీరో పాత్రకు యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. వారి నటన స్వచ్చంగా వుంది. వారితోపాటు వారి స్నేహితులుకూడా బాగా నటించారు.

మొదటి భాగం చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగున్నాయి. జగదీష్‌ పాత్రను నిర్మాత యష్‌ రంగినేని పోషించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య సాగే ఫైట్‌ రియలస్టిక్‌గా వుంది. అన్నిసార్లు కాకుండా రెండు, మూడు సార్లు అయితే బాగుండేదనిపిస్తుంది. ఇక ఇందులో నటించిన మిగిలిన నటీనటులు బాగానే చేశారు.

ప్లస్ పాయింట్స్
* 1980s కథ
* నటీనటులు
* కథలో మలుపులు
మైనస్ పాయింట్స్
* పాత పంథాలో సన్నివేశాలు

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్ : స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ


Spread the love
Tags: Annapurna Photo Studio MovieAnnapurna Photo Studio Movie ReviewBroTheAvatarDeepikapadukoneKalki2898Kalki2898ADPrabhasఅన్నపూర్ణ ఫొటో స్టూడియో
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.