Allu Arjun Pushpa 2 Dialogue : ఇటీవల విడుదలైన ‘బేబి’ మూవీపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రాన్ని సాయి రాజేష్ తెరకెక్కించిన విధానానికి ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. వారం రోజుల్లోనే ఊహించని కలెక్షన్లు కొల్లగొట్టిన ‘బేబి’ చిత్రాన్ని కల్ట్ బ్లాక్ బస్టర్‌గా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో అప్రిసియేషన్ అ మీట్ నిర్వహించింది.

దానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు. ‘బేబీ’ సినిమా బాగా నచ్చిందన్న ఆయన.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చివర్లో అభిమానులు పుష్ప-2 డైలాగ్ కావాలని కోరగా ఆయన ఓ పంచ్ డైలాగ్ వినిపించారు. ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది.. అది పుష్పా గాడి రూల్’’ అని అల్లు అర్జున్ అనడంతో అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటింది. ఇక్కడ పుష్ఫ-2 డైలాగ్ చెబుతానని తాను అస్సలు అనుకోలేదని అల్లు అర్జున్ చెప్పారు.
ఈ డైలాగ్ తో ప్రస్తుతం అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో పుష్ప 2పై మరిన్ని అంచనాలు పెరిగాయి. పుష్ప 2 డైలాగు గురించి మాట్లాడుతూ ఇలా చెప్పడం చిరు లీక్స్ కన్నా డేంజరని నవ్వులు పూయించాడు బన్నీ. ఇలా పలుమార్లు మావయ్య ప్రస్తావన తేవడంతో మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ పుష్ప మూవీతో ఎంతగానో అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2లో విభిన్న గెటప్ లో రెట్టింపు జోష్ గా కనిపిస్తున్నారు.
Vaishnavi Chaitanya : బేబీ లో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి వైష్ణవిని ఎలా ఒప్పించారో తెలుసా..!?