Chandrababu Meetings : రాష్ట్రంలో అధికారంలోకి వద్దామని కలలుకంటున్న టీడీపీకి చంద్రబాబు సభలకి జనం నుండి వస్తున్న స్పందన చూస్తుంటే గుబులు కాదు వణుకు పుడుతుంది. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన జనాన్ని చూసి ఆ పార్టీ నేతలు బెంబేలెత్తి పోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసిన మచిలీపట్నం, గుడివాడ సభల్లో లక్షల్లో జనం వస్తారు అనుకుంటే చంద్రబాబు ప్రసంగించే సమయానికి కనీసం వేలల్లో కూడా జనం లేకపోవడం,
వారూ తరలించిన జనంలో చాలామంది వెళ్లిపోగా మిగిలిన వాళ్లే ఉసూరుమంటూ కుర్చీలో కూర్చోవడం చూస్తుంటే ఆ పార్టీ నేతలను కలవరపాటుకు, తీవ్ర ఆందోళనలకు గురి చేస్తుంది. అసలు జిల్లాలో ఇంత ఘోరమైన పరిస్థితి టీడీపీకి ఇంతకు ముందు ఎపుడూ లేదు. సభలకు భారీగా జనం అని తమ అనుకూల పత్రికల్లో ఎంత రాయించుకున్నా.. దగ్గర నుండి తీసిన ఫోటోలతో ఎంత ప్రచారం చేసినా వాస్తవాలు ఏంటి అనేది సోషల్ మీడియా మాధ్యమాల్లో వీడియోల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి.
టీడీపీ అనుకూల మీడియాలలో వచ్చిన వార్తలను ఒకవైపు.. వాస్తవాలను ఒక వైపు ఉంచి జనానికి అసలు నిజాలు చెబుతున్నారు.. “పార్టీ లేదు.. బొక్కా లేదు..” అని అచ్చెన్నాయుడు మాటలను మరోసారి గుర్తు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. పరిస్థితులు చూసిన జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేత పార్టీ నుండి బయటకు వస్తే తప్ప తనకు భవిష్యత్ లేదు అని సొంత వర్గం దగ్గర వాపోయినట్టు సమాచారం.
ఇప్పటికే రెండు సార్లు టీడీపీ తరపున గెలిచిన చరిత్ర ఆయన ఫ్యామిలీకి ఉంది. త్వరలోనే ఆయన టీడీపీ కి గుడ్ బై చెప్పనున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫైనల్ గా చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన టీడీపీ పార్టీ డొల్ల తనాన్ని బయటపెట్టింది.