Heer Achhra : ఒక నిర్దిష్ట పరిశ్రమలోకి ప్రవేశించడం మరియు తమకంటూ ఒక పేరును సృష్టించుకోవడంలో ముందుకు వెళ్లడం ఎంతో కష్టమైన పని. భారతీయ మోడల్ మరియు నటి హీర్ అచ్రా, అద్భుతమైన ప్రయత్నం మరియు కృషి ఫలితంగా మోడల్ గా సుస్దిర స్దానాన్ని సంపాదించుకుంది. హీర్ అచ్రా మోడల్ నటి మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి.. తన నటన నైపుణ్యంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది.

మోడలింగ్ లో దూసుకుపోతూ సినిమా రంగంలోకి ప్రవేశించి నటనలోనూ తన సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముంబై అందాల తార హీర్ ఆచ్రా. భారీ అవకాశాలతో ఒకవైపు సినిమాలలోనూ, యాడ్స్ లోను బిజీగా ఉంటూ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాప్ సెలబ్రిటీగా ఆదరణ పొందింది. దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్ లైనటువంటి సన్ సిల్క్, నివియా,
Baby OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబీ..
మియా జ్యువెలరీ తదితర బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ మోడల్‌గా పనిచేయడం విశేషం. నటన, మోడలింగ్ అంశాల్లో తన ప్రయాణానికి టెమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ బిరుదును పొందింది. అంతేకాదు, ఎఫ్‌బీబీ ఫెమీనాతో పాటు మిస్ గుజరాతీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకుంది. హీర్ అచ్రా చేయబోయే యాడ్స్, మోడలింగ్ తదితర వ్యవహారాలను ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ ‘‘రన్ వే లైఫ్‌స్టైల్’’ పర్యవేక్షిస్తుంది.
Anupama Parameswaran Latest Pics : అనుపమ అందాలు..