Naga Shaurya : నాగశౌర్య ఊహలు గుసగుసలాడే సినిమా బ్రేక్ ఇచ్చింది. ఛలో మూవీతో హిట్ కొట్టాడు. స్టార్ లేడీ రష్మిక మందానను తెలుగు తెరకు పరిచయం చేసింది నాగ శౌర్యనే. టాలీవుడ్ లో నటించింది, హిట్ కొట్టింది కొన్ని సినిమాలే అయినా.. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఇటీవల ‘రంగబలి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన నాగశౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Baby Movie : ఆ హీరోయిన్ కోసం రోజంతా మందు తాగిన ఆనంద్..
“నేను వర్క్ చేసిన హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ రాస్తుంటారు. మాళవిక, రాశీఖన్నాతో పాటు పలువురు హీరోయిన్లతో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అవన్నీ ఫేక్ న్యూస్ లు. నేను ఏ హీరోయిన్ తోనూ డేటింగ్ చేయలేదు. నాకు హీరోయిన్ అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. ఆమెతో లింక్ కట్టి ఎవరూ వార్తలు రాయలేదు. అనుష్క శెట్టితో ఎఫైర్ పెట్టి న్యూస్ రాయ ప్లీజ్” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు నాగశౌర్య.
Sai Dharam Tej : సమంత బాటలో సాయిధరమ్ తేజ్..
