Rajinikanth : రజినీకాంత్.. ఈ పేరుకు ముందు సూపర్‌స్టార్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఆ పేరు ఆయన కోసమే పెట్టినట్లుగా సినీ, వ్యక్తిగత జీవితాలతో విశేష ప్రజాదరణ పొందారు. సూపర్‌స్టార్ రజినీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. జపాన్‌లో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆయన చేసిన ముత్తు సినిమా ఇప్పటికీ అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఆశలు, రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జైలర్ మూవీ ఆగస్టులో రిలీజ్ కి సిద్ధమవుతుండగా ఇందులో రజనీకాంత్ ను ఈ సినిమాతో సరికొత్తగా చూపించబోతున్నాడు డైరెక్టర్ నెల్సన్. ఈ సినిమాతో రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ అందిస్తారని భావిస్తున్నారు.
Prabhas : ఆ మూవీలో నేనే కమిడియన్ ని..
ఇదిలావుండగా చెన్నెలోని రజినీకాంత్ ఫౌండేషన్ పేరిట భారీ మోసం జరిగింది. కొంత మంది దుండగులు ఫేక్ అకౌంట్ సృష్టించి అమాయకులను మోసం చేశారని సమాచారం. బాధితుల నుంచి ఏకంగా రూ.2 కోట్ల నగదు వసూలు చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న రజీనికాంత్ ఫౌండేషన్ నిర్వాహకులు చెన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Prabhas Ram Charan : త్వరలో ప్రభాస్, రామ్ చరణ్ మూవీ..