Prabhas : రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ కల్కి2898AD. ఈ మూవీ గ్లింప్స్ ను అమెరికా శాన్‌డియాగాలోని కామిక్ కాన్ ఈవెంట్‌లో శుక్రవారం రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్‌తో ఈ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ వీడియో గ్లింప్స్ ఉందంటున్నారు. ఈ వీడియో గ్లింప్స్‌లోనే సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. కల్కి అవతారం నేపథ్యంలో ప్రాజెక్ట్ కే మూవీని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హిందూ మైథాలజీని టచ్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.

కలియుగాంతంలో విష్ణు మూర్తి కల్కి అవతారంలో మళ్ళీ వస్తారని పురాణాల్లో రాసుంది. దాని ప్రకారమే నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి అవతరంలో ప్రభాస్ కనిపిస్తుండటంతో.. ఈ మూవీ చూడడానికి ఆడియన్స్ బాగా ఎగ్జెటింగ్ గా ఉన్నారు. ఇందులో కల్కి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతోంది. కానీ కామిక్ కాన్ ఈవెంట్ లో మాట్లాడిన రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. ఈ పాత్ర చాలా కామెడీగా ఉంటుందని,
Prabhas Ram Charan : త్వరలో ప్రభాస్, రామ్ చరణ్ మూవీ..
నాగ్ అశ్విన్ ఈ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గ డిజైన్ చేశారని చెప్పుకొచ్చారు. ఇందులో బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఒకే ఒక్క కమెడియన్ ఉంటాడు. అది నేనే” అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఈ హీరో చెప్పింది నిజమో అబద్దమో తెలియదు కానీ.. ‘ప్రభాస్ లుక్, పోస్టర్లను చూసిన ప్రేక్షకులెవ్వరు ప్రభాస్ ఈ చిత్రంలో కామెడీ చేస్తాడంటే ఎవ్వరు నమ్మరు’ అంటూ నెటిజన్ల కామెంట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక మూవీ ఏ మాత్రం తేడా కొట్టినా ఆదిపురుష్ రిజల్ట్ రిపీట్ అవుతుందంటున్నారు నెటిజన్స్.
Raashi Khanna Latest Hot Pics: అందాల రాశీ..