Ram Charan : టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. కాగా, నేడు చిన్నారికి బారసాల కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనలు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఒకటి వచ్చింది. అది పంపింది ఎవరో కాదు.. దేశంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ.
ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. ముఖేష్ అంబానీ దంపతులు ఏకంగా బంగారు ఊయలను పాప కోసం బహుమతిగా పంపారు. దాని విలువ రూ. 1.20 కోట్లని తెలుస్తోంది. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారంతో దీన్ని ప్రత్యేకంగా చేయించారట. ఈ ఊయల్లోనే బారసాల కార్యక్రమం చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ ఈరోజు మెగా ప్రిన్సెస్ పేరుతో పాటు ఫేస్ ని కూడా రివీల్ చేస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.