Suriya Condolence to his fans families : తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటిసారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక సూర్య లేటెస్ట్గా కంగువ (Kanguva) అంటూ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. అబ్బురపరిచే విజువల్స్‌తో అదరగొట్టింది కంగువ టీజర్.

ఇదిలావుండగా నిన్న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా నరసరావుపేట తాలుకా కట్టుబడిపాలెంలో నక్కా వెంకటేశ్, పోలూరు సాయి శనివారం అర్ధరాత్రి నటుడు సూర్య ఫ్లెక్సీలు కడుతుండగా ఫ్లెక్సీకి ఉన్న ఐరన్ ఫ్రేమ్ పక్కనున్న విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులు డిగ్రీ సెకండియర్ చదువుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Alia Bhatt: నా కూతురు నాలా సినిమాల్లోకి రాకూడదు.. నేను నిద్ర మానుకొని ఏకధాటిగా..
దీంతో వారి కుటుంబాలను సూర్య వీడియో కాల్ లో పరామర్శించాడు. వాళ్లకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. మృతుల్లో ఒకరి సోదరి తాను డిగ్రీ చదివానని ఉద్యోగం ఇప్పించాలని కోరగా.. తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని సూర్య తెలిపారు. ఉద్యోగంతో పాటు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి.. వారిలో ధైర్యాన్ని నింపారు హీరో సూర్య. కంగువ సూర్య 42వ చిత్రం కాగా ఇందులో దిశా పటాని హీరోయిన్ గా.. యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.