Snakes : అందరికి కలలు రావడం సహజం కానీ కొందరికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు కలలోకి వస్తే శుభమా? లేక అశుభమా? అని చాలామంది మదన పడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు పాము అంటే..నాగు పాము, నల్ల త్రాచు, కొండచిలువ ఇట్లా రకరకాల పాములు కలలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఏ రంగుపాము కలలోకి వస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు రంగు పాము : కలలో ఎరుపు రంగు పాము రావడం మంచి శుభ సూచకం. ఎర్రటిపాము మీ జీవితంలో మరింత బాధ్యత వహించాలని సూచికగా కనిపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
నీలం రంగు పాము : నీలం రంగు పాము కలలోకి రావడం వల్ల సాధారణంగా సానుకూలతకు సంకేతంగా చెప్పుకోవచ్చు. జీవితంలో మీకు ఏదో మంచి జరగబోతున్నట్లు అది సూచిక. అలాగే తెలివితేటలకు సృజనాత్మకతకు, కూడా చిహ్నంగా నీలం రంగుపామును చెప్పుకోవచ్చు.
ఆకుపచ్చ పాము : ఆకుపచ్చ పాము కనిపిస్తే అది వ్యక్తిగత అభివృద్ధికి మార్గదర్శకంగా అనుకోవచ్చు.
తెలుపు రంగు పాము : ఈ రంగు పాము కలలో కనిపిస్తే మీరు చాలా ముఖ్యమైన పెద్ద రహస్యాలను దాచిపెడతారని అర్థం.