Mahaveerudu Movie Review: దర్శకుడు : మడోన్ అశ్విన్
నటీనటులు : శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు మరియు తదితరులు
నిర్మాతలు : అరుణ్ విశ్వ
సంగీతం : భరత్ శంకర్
సినిమాటోగ్రఫీ : విషు అయ్యన్న
విడుదల తేదీ : 14/7/2023
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు పైన శివ కార్తీకేయన్ ఒకరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నేడు తమిళంతో తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెల్ఫ్ మెడ్ స్టార్ అనే ట్యాగ్ ని అందుకున్నాడు. రెమో చిత్రం నుంచి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. ఇక డాన్, డాక్టర్ మరియు ప్రిన్స్ చిత్రాలతో ఇంకా దగ్గరయ్యాడు. తాజాగా ‘మహావీరుడు’ అనే ఫాంటసీ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ట్రైలర్ తొనే మంచి అంచనాలని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథ :
ఒక భయస్తుడు కార్టూనిస్ట్ (శివకార్తికేయన్) గా పని చేస్తూ ఉంటాడు. అయితే తనకి ఒక పొలిటికల్ పార్టీ నుండి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ప్రజలని ఆకర్షించడానికి మంచి కార్టూన్స్ డిజైన్ చేయాలనీ తనకి పని ఇస్తారు. అయితే హీరో ఒక కల్పితమైన పాత్రని సృష్టిస్తాడు. అనుకోకుండా ఆ పాత్ర, ఈ భయస్తుడైన హీరో పైకి చూసినప్పుడల్ల ఆ పాత్ర ఇతనిలో ఆవహించినట్టు అయ్యి శక్తివంతుడిగా మారిపోతాడు. అసలు ఆ పాత్ర ఏంటి, ఎలా ఆ పాత్ర ఆవహిస్తుంది. పైకి చూస్తే ఏం కనిపిస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మహావీరుడు చూడాల్సిందే..
Samantha Old Tweet : సామ్ కి తలనొప్పిగా మారిన ఓల్డ్ ట్వీట్.. అప్పుడలా.. ఇప్పుడిలా..
రివ్యూ :
దాదాపుగా కమర్షియల్ సినిమాలన్నీ ఒక టెంప్లేట్ని ఫాలో అవుతూ ఉంటాయి, హీరో ఇంట్రడక్షన్, ఒక పాట, ఫైట్, లవ్ ఇలా.. అయితే మహావీరుడు కూడా కమర్షియల్ సినిమానే, కానీ మనం చూసే రెగ్యులర్ టెంప్లేట్లో నడిచే సినిమా మాత్రం కాదు. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి, దాని చుట్టూ కమర్షియల్ అంశాలని జోడించి అల్లిన కథే ఈ మహావీరుడు.
ఈ చిత్రం ఒక మాములు కమర్షియల్ సినిమాలాగే ప్రారంభమైన, ఒక్కసారి హీరో పాత్ర పరిచయం చేసాక, కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మొదటి సగం హీరో తాలూకు భయాలు, తన పని, తన ప్రేమ కథని కామెడితో జోడించి ఎంగేజింగ్ గా చెప్పాడు దర్శకుడు మడోన్ అశ్విన్. అయితే ఇంటర్వెల్ బ్లాక్ మనల్ని రెండవ భాగం చూసేలా చేస్తుంది.
Deepika Padukone Net Worth : స్టార్ హీరోలను తలదన్నేల దీపికా పదుకొనె సంపాదన..
ఇక రెండవ భాగం ఆధ్యంతం ఆసక్తికరమైన సన్నివేషాలతో ఎంగేజ్ చేస్తుంది. హీరో ఒక భయస్తుడి గా ఉండి, ఒక్కసారిగా శక్తివంతుడు అవ్వడాన్ని చాలా బాగా చూపించారు. అయితే హీరో సృష్టించిన పాత్ర, తను శక్తివంతంగా అవ్వడానికి ఎలా ఉపయోగపడిందో అనే ఆసక్తికర విషయాన్ని ఆకట్టుకునేల తెర మీద ప్రెసెంట్ చేసారు. పొలిటికల్ యాంగిల్ అంత ఆసక్తికరంగా అనిపించకపోయినా, హీరో క్యారెక్టర్ వల్ల రెండున్నర గంటలపాటు మిమ్మల్ని సీట్ కి అతుక్కుపోయేలా చేస్తుంది.
ఇక నటన విషయానికి వస్తే..
కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, కొంచెం కొత్తగా ట్రై చేసే శివకార్తికేయన్, ఈసారి కూడా ఒక కొత్త రకమైన కమర్షియల్ చిత్రాన్ని మనకి అందించాడు. ఇక ఈ చిత్రంలో కూడా తన రెగ్యులర్ పాత్రలకి భిన్నంగా, ఒక భయస్తుడి పాత్రలో చాలా బాగా నటించాడు. అదితి శంకర్, పాత్రకి మంచి స్క్రీన్ టైం దొరికింది, ఇక ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. మిస్కిన్ ఉన్నంతలో పర్వాలేదు.
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
ఇక టాలీవుడ్ లో మంచి పేరుగాంచిన కమెడియన్ సునీల్ మొదటిసారి తమిళ్ లో నటించిన చిత్రం ఇది. తను కూడా ఉన్నంతలో బాగా చేసాడు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు మెప్పించారు. మండేలా చిత్రంతో మడోన్ అశ్విన్, ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఒక స్టార్ హీరోతో చిత్రం చేస్తున్నాడు అనేసరికి రెగ్యులర్ కథతో వస్తాడు అనుకున్నారు అందరూ. కానీ కొత్త కథకే కొంత కమర్షియల్ అంశాలని జోడించి, చాలా బాగా తెర మీద ప్రెసెంట్ చేసాడు.
ముఖ్యంగా ఫాంటసీని ఈ చిత్రంలో మిళితం చేసిన విధానానికి మనం మడోన్ అశ్విన్ ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇక సగటు ప్రేక్షకున్ని మెప్పిచడంలో మడోనా అశ్విన్ విజయం సాధించాడని చెప్పొచ్చు. సాంకేతికంగా మహావీరుడు చాలాబాగుంది. నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఇక విషు అయ్యన్న ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు.
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : కొత్తరకమైన కమర్షియల్ మూవీ మహావీరుడు..
Baby Movie Review : ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ రివ్యూ & రేటింగ్..