Baby Movie Review : నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, ప్రభావతి లిరీష తదితరులు
కథ, దర్శకత్వం: సాయి రాజేశ్
నిర్మాత: SKN
కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సినిమాటోగ్రఫి: MN బాల్ రెడ్డి
రిలీజ్ డేట్: 14/7/2023
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన మూవీ బేబీ (Baby). కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేరకొండ తమ్ముడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. మరి ఈ మూవీ ఆనంద్ దేవరకొండకు హిట్ అందించిందా లేదా రివ్యూలో చూద్దాం..
కథ :
వైషు అలియాస్ వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఓ బస్తీ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ప్రేమిస్తుంటుంది. ప్రేమను అతనూ అంగీకరిస్తాడు. వీరి ప్రేమ స్కూల్ డేస్‌లోనే ముదిరి పాకాన పడుతుంది. అయితే పదో తరగతి తప్పడంతో ఆనంద్ ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడ కొత్త పరిచయాల వల్ల వైషూ ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి.
Deepika Padukone Net Worth : స్టార్ హీరోలను తలదన్నేల దీపికా పదుకొనె సంపాదన..
ఈ క్రమంలోనే ఆమె తన క్లాస్‌మెట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొదలైన ఆ బంధం ఆ తర్వాత అడ్డదారులు తొక్కుతుంది. ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్ కి వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? వీరిద్దరి వ్యవహారం ఆనంద్ కి తెలిసిందా? నిజం తెలిశాక తను ఎలా స్పందించాడు? అలాగే విరాజు వైష్ణవి – ఆనంద్ ల ప్రేమకథ తెలిసిందా? అసలు ఆనంద్ – విరాజ్ లలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది?అన్నది తెరపై చూడాల్సిందే..
రివ్యూ :
పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథల గురించి వార్తల్లో చదువుతున్నాం, తరచూ టీవీల్లో చూస్తున్నాం. సాయి రాజేష్ వాటిని చూసి స్ఫూర్తి పొందారో? లేదో? ఆయన కథలో ఆ కథలు అన్నీ కనిపించాయి. ఆ కథల నుంచి బలమైన సన్నివేశాలను, హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను ఆయన రాసుకున్నారు. యువతలో చాలామంది తమను తాము తెరపై చూసుకుంటారు. సమాజంలో జరుగుతున్న అంశాలకు దర్శకుడు ‘బేబీ’తో ఓ రూపం ఇచ్చారు.
Varahi VijayaYathra : తాడేపల్లిగూడెంలో గర్జించిన జన సైన్యం..
ప్రీ ఇంటర్వెల్ వరకు ‘బేబీ’ కథ నిదానంగా సాగుతుంది. పాఠశాలలో ప్రేమకథ ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే… మధ్యలో మంచి పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర అసలు కథ, కథలో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ‘ప్రేమిస్తే’తో పాటు కొన్ని సినిమాలు గుర్తు రావచ్చు. అయితే.. కథానాయికలో మానసిక సంఘర్షణ, నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది.
ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్.. ఇద్దరితో వైష్ణవి చైతన్య సన్నివేశాలు ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో? అని ఆసక్తి రేపాయి. థియేటర్లలో ఆ సీన్లకు విజిల్స్, క్లాప్స్ పడటం గ్యారెంటీ. ఇంటర్వెల్ తర్వాత కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ‘ప్రేమిస్తున్నా…’ పాట, ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు మౌనంగా చూసేలా చేస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందో? అని ఆలోచింపజేస్తాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగ భరితంగా సాగుతాయి. తండ్రి ప్రేమను చక్కగా ఆవిష్కరించారు.
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
బేబీకి అసలైన బలం ఇంటర్వెల్, క్లైమాక్స్ & మాటలు, పాటలు! సాయి రాజేష్ రచనలో కొన్ని మాటలు థియేటర్లలో ఆటంబాంబుల్లా పేలతాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద అభిమానాన్ని కూడా చూపించారు. క్యారెక్టర్లు, ఆ క్యారెక్టరైజేషన్స్ కంటే ముఖ్యంగా సొసైటీని రిప్రజెంట్ చేసేలా సాయి రాజేష్ సీన్లు రాశారు. దర్శకుడిగా ఆ విషయంలో సాయి రాజేష్ పట్టు చూపించారు.
నటీనటులు విషయానికి వస్తే..
ఆనంద్ దేవరకొండ మరోసారి అద్భుతంగా నటించాడు. సెకండాఫ్‌లో తన నటన విశ్వరూపమే చూపించమే కాకుండా గుండెను పిండేసేలా పెర్ఫార్మ్ చేశారు. ఇక విరాజ్ అశ్విన్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. స్టెయిల్‌గా, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. తన క్యారెక్టర్ వరకు విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి.
Trivikram Bro Remuneration : బ్రో మూవీకి త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యునరేషన్..
ఇక సినిమాకు బ్యాక్ బోన్ వైష్ణవి చైతన్య. ఎవరూ ఊహించని విధంగా, పాత్ర పరిధిని దాటి ఊహకు అందని విధంగా ఫెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. హీరోయిన్గా తొలి చిత్రంతోనే సినిమా భారాన్నంతా తన భుజాలపై మోసిందనే చెప్పాలి. డ్యాన్సులతో అదరగొట్టింది. కళ్లతోనే హావభావాలను ప్రదర్శించింది. పాత్రలో ఉన్న వేరియేషన్స్‌ను సులువుగా పండిచిందని చెప్పాలి. నాగబాబు, వైవా హర్ష, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..
బేబీ సినిమాను హిట్ జోన్లోకి చేర్చింది విజయ్ బుల్గానిన్ మ్యూజిక్. ఒకే ఒక పాటతో బ్లాక్ బస్టర్ ఫీలింగ్‌ను తీసుకొచ్చాడు. ఓ రెండు ప్రేమ మేఘాల పాట మాత్రమే కాకుండా.. BGMతో పలు చోట్ల హృదయాన్ని పిండేశాడు. పలు సీన్లను కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫీల్‌గుడ్‌గా మార్చాడు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చెక్కినట్టు చూపించాడు. విప్లవ్ ఎడిటింగ్ కూడా బాగుంది. SKN, ధీరజ్ పాటించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్..
* కథా నేపథ్యం
* యువతరం మెచ్చే అంశాలు
* పాటలు, నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్..
* నెమ్మదిగా సాగే కథనం
* ముగింపు
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : టీనేజ్ కుర్రాళ్ల గుండెల్ని గట్టిగా కొట్టే
యూత్‌ఫుల్ ట్రాయాంగిల్ లవ్ స్టోరీ `బే…………..బీ`.
Urvashi Rautela Hot Pics : బ్రో బ్యూటీ హాట్ పిక్స్.