Urvashi Rautela Remuneration – నిమిషానికి కోటి అడుగుతున్న ఊర్వశి..
Urvashi rautela remuneration – కొంతమంది నటీనటులు పెద్దగా సినిమాల్లో నటించక పోయినా కేవలం అందం అభినయం కారణంగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాగే స్క్రీన్ పై తాము కనిపించేది కొంతసేపు అయినా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నవాళ్ళు కూడా లేకపోలేదు. దీంతో వీరికి దీపం ఉండగానే ఇల్లు చకంబెట్టుక్కోవాలనే సామెత అలాగే వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలనే సామెత చక్కగా సరిపోతుందని చెప్పవచ్చు.
Urvashi Rautela Stunning Photos : బాస్ పార్టీ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ పిక్స్
Pushpa 2 Item Song : పుష్ప 2 ఐటెంసాంగ్లో హీరోయిన్ కన్ఫర్మ్..!
ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్స్ క్రేజ్:
అయితే తెలుగులో ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం వాల్తేరు వీరయ్య చిత్రంలో బాసు వేర్ ఈజ్ ది పార్టీ స్పెషల్ సాంగ్ లో నటించి అందం, అభినయం తో కట్టి పడేసిన హిందీ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే మెగాస్టార్ తో కలిసి నటించిన ఈ స్పెషల్ సాంగ్ మంచి హిట్ అవ్వడంతో ఊర్వశి కి తెలుగులో ఆఫర్లు బాగనే క్యూ కడుతున్నాయి.

Urvashi rautela remuneration:
అయితే తాజా సమాచారం ప్రకారం నటి ఊర్వశి రౌతేలా రెమ్యూనరేషన్ బాగానే పెంచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ను బట్టి ఒక్కో స్పెషల్ సాంగ్ కి దాదాపుగా రెండు కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకి పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉందని బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఊర్వశి గతంలో మోడలింగ్ రంగంలో కూడా బాగానే రాణించి విశ్వసుందరిగా అవార్డులు సొంతం చేసుకుంది.
వరుస సినిమా ఆఫర్లు:
నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ కి ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు రావడంతో వెంటనే ఓకే చెబుతూ సొమ్ము చేసుకుంటుంది. దీంతో తెలుగు, తమిళం, హిందీ అంటూ శని పరిశ్రమతో తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమంలోనూ స్పెషల్ సాంగ్ విషయంలో తన హవాసాగిస్తూ ఉంది. మరో వైపు సోషల్ మీడియా మధ్యభాలలో కూడా బాగానే ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది దీంతో రోజురోజుకీ ఫాన్ ఫాలోయింగ్ బాగానే పెరుగుతోందని చెప్పవచ్చు.
Ram Pothineni Boyapati : బాక్సాఫీస్ ఊచకోతకు బోయపాటి స్కంద రెడీ..
Trivikram Bro Remuneration : బ్రో మూవీకి త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యునరేషన్..
Banana leaves : అరిటాకులో భోజనం చేస్తే జరిగేది ఇదే..!
ఊర్వశీ రౌతెలా సినీ కెరియర్:
ఈ విషయంలో ఉండగా తెలుగులో ఈ బాలీవుడ్ బ్యూటీ మెగా సుప్రీం హీరో సాయి తేజ మరియు పవర్ సర్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రంలో కూడా పవర్ ఫుల్ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. అయితే ఈ పాట కోసం కూడా ఊర్వశీ దాదాపుగా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఊర్వశి అభిమానులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెతలు వల్లిస్తున్నారు.