Pawan Kalyan Clarify : సోషల్ మీడియా వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan : రాజకీయాలలో పుకార్లు అనేవి చాలా వరకు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఒక వార్త వ్యాపించడానికి ఎంతో సమయం తీసుకోదు. కానీ దాని వెనకాల ఉన్న నిజాలు బయటపడడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు అలా వైరల్ అయిన వార్తనే పవన్ కళ్యాణ్ కి సంభందించిన విడాకుల వార్త. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాతో విడాకులు తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ ఉంది.
Pawan Kalyan Instagram Record: Excellent..!! పవన్ ఎంట్రీతో ఇన్ స్టాలో రికార్డులు బద్దలు..
దీంట్లో నిజాలు తెలుసుకోకుండానే చాలామంది దీన్ని షేర్ చేసి, వారే డిసైడ్ చేసేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలా తెగ వైరల్ అవుతున్న తన వివహబంధం గురించి ఆ ఫేక్ న్యూస్ కి తెరదించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వారాహియాత్ర గురించి మనందరికీ విదితమే. ఎంతో విజయవంతంగా వారాహియాత్ర మొదటి దశను ఆయన ముగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజలందరికీ చాలా దగ్గరై అందరి మన్ననాలను పొందారు.
భార్య అన్నా తో కలిసి పవన్ కళ్యాణ్ పూజ..
వారాహియాత్ర విజయవంతమైన సందర్భంగా ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు తన భార్య అన్నా తో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో కలిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. క్షణాల్లో ఈ ఫోటోలు వైరల్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధల కారణంగానే అన్నా మెగా ఫ్యామిలీ లో జరుగుతున్న ఫంక్షన్లకు హాజరు కావడం లేదనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఈ వార్తలన్నీటికి పుల్ స్టాప్ పెడుతూ అన్నా, పవన్ కళ్యాణ్ తో కలిసి పూజ కార్యక్రమాలలో పాల్గొంది. గత కొద్ది రోజులుగా అన్నా విదేశాలలో పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అటు వరుస సినిమాలతో, ఇటు రాజకీయ పనులతో బిజీ బిజీ గా గడుపుతున్న సందర్భంలో ఇలాంటి వార్తలు పూటకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండోదశ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ యాత్ర కోసం త్వరలోనే పవన్ మంగళగిరి చేరుకోనున్నారు.