Satya Krishnan : క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై ఆసక్తికర వ్యాఖ్యలు:
తెలుగు లో అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర సెంటిమెంట్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో సత్య కృష్ణన్ పెద్దగా సినిమాలపై దృష్టి సారించడం లేదు. అయితే ఇందుకు కారణంగా నటి సత్య కృష్ణన్ ఈ మధ్య రెస్టారెంట్ బిజినెస్ లో బిజీ అవ్వడమనే చెప్పాలి. అయితే తాజాగా నటి సత్య కృష్ణన్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆఫర్ల కోసం లొంగిపోవడం కరెక్ట్ కాదు:
ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ కి వచ్చే చాలామంది నటీనటులలో సినిమా పట్ల అభద్రతాభావం ఎక్కువగా ఉందని దీంతో కొందరు ఆశావాది దర్శకనిర్మాతలు చూపే ప్రలోభాలకు లొంగిపోతున్నారని స్పష్టం చేసింది. అయితే రాణించాలంటే మంచి అందం, శరీరాకృతి మాత్రమే కాదు చాకచక్యంగా వ్యవహరించే గుణం, మంచి క్రమశిక్షణ వంటివి కూడా చాలా అవసరం అని చెప్పుకొచ్చింది. మనలో ప్రతిభ ఉంటే కచ్చితంగా ఏదో ఒకరోజు బయటపడుతుందని అప్పుడు పరిస్థితులు, స్తితిగతులు పూర్తిగా మారిపోతాయని కాబట్టి మనకి టైమ్ వచ్చేవరకు ఓపికగా ఉండాలని నూతన నటీనటులకు సూచించింది.
Megastar Viswambhara Movie : విశ్వంభర లో యంగ్ హీరోయిన్..
Eagle Movie OTT : ఈగల్ స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటిటి లోన..
Gopichand Bheema : భీమా ట్రైలర్ వచ్చేస్తుంది..!!
బెస్ట్ హోటల్ అవార్డు:
ఈ విషయం ఇలా ఉండగా నటి సత్య కృష్ణన్ హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో లిక్విడ్స్ అనే హోటల్ రెస్టారెంట్ ని ప్రారంభించింది. కాగా ఈ హోటల్ రెస్టారెంట్ అతి తక్కువ కాలంలోనే బాగానే క్లిక్ అయ్యింది. అంతేకాదు గత ఏడాది బెస్ట్ హోటల్ అవార్డు కూడా దక్కించుకుంది. కాగా ఈ విషయాన్ని నటి సత్య కృష్ణన్ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అలాగే హోటల్ పనులతో బిజిబిజీ గా ఉంటుండడంతో సినిమాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈ మధ్య నటి సత్య కృష్ణన్ కొత్త సినిమాలకి కూడా ఒకే చెప్పనట్లు తెలుస్తోంది.