• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

నాగబాబు పోటీ అక్కడి నుంచే.. మరి పవన్ కల్యాణ్ సంగతేంటి?

జనసేనాని నాగబాబును ఎక్కడి నుంచి బరిలోకి దింపుతున్నారో తెలుసా?

Sivaji by Sivaji
February 16, 2024
in Janasena News, Latest News, Political News
0 0
0
నాగబాబు పోటీ అక్కడి నుంచే.. మరి పవన్ కల్యాణ్ సంగతేంటి?
Spread the love

ఏపీలో రాజకీయం మంచి రసవత్తరంగా సాగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అన్నిటికంటే ముందు సీట్ల సర్దుబాటుతోనే వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు రాగా.. టీడీపీ, జనసేన కూడా తాము పోటీ చేసే సీట్లపై దాదాపుగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు అంశం తెరమీదకు రావడంతో జనసేన-టీడీపీ కూటమి అధికారికంగా సీట్ల గురించిన ప్రకటన చేయనప్పటికీ ఏయే సీట్ల నుంచి ఎవరు పోటీ చేయాలనేది దాదాపు ఖారారు అయినట్లు తెలుస్తోంది.

AP Elections 2024 : రాజకీయ పార్టీలలో బిగుస్తున్న ‘సీటు’ముడి..!!

Table of Contents

Toggle
  • 40 సీట్లకు తక్కువగా కాకుండా ఎన్నికల బరిలో..
  • ఆ నాలుగు స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటే చేసే అవకాశం
  • తిరుపతిలో జనసేన గెలిచే అవకాశం..
  • నాగబాబు మాత్రం అనకాపల్లి నుంచి ఫిక్స్..

40 సీట్లకు తక్కువగా కాకుండా ఎన్నికల బరిలో..

ఈ సమయంలోనే జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎన్ని సీట్ల నుంచి ఎన్నికల బరిలో నిలబడతారు, పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్లు ఎన్ని అనే అంశాలపై చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో జనసేన ఎక్కువ సీట్లు ఇవ్వాలని మొదటి నుంచి కోరుతున్న సంగతి తెలిసిందే. 40 సీట్లకు తక్కువగా కాకుండా ఎన్నికల బరిలో నిలబడాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Pedana Constituency : పెడన సీట్ జనసేనదే..!!

ఆ నాలుగు స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటే చేసే అవకాశం

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా భీమవరం నుంచి పోటీలో దిగాలని పవన్ భావిస్తున్నారు. అలాగే గాజువాక కాకుండా శ్రీకారం జిల్లాలో ఎన్నికల బరిలో నిలుస్తారని లేదా తిరుపతి లేదా అనంతపురం సిటీ నుంచి పోటీ చేస్తారని విశ్వసనీయ సమాచారం.

Pawan Kalyan: అనుమతులు ఇవ్వకుండా ఆ నిప్పుకణికను ఆపగలరా..?

తిరుపతిలో జనసేన గెలిచే అవకాశం..

జనసేనాని అనంతపురం నుంచి పోటీ చేస్తే తాను స్వచ్ఛందంగా తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇప్పటికే ప్రకటించారు. అయితే నందమూరి బాలయ్య అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తుండటం వల్ల పవన్ పోటీ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమకు కేంద్రంగా ఉండే తిరుపతి నుంచి జనసేనాన్ని ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా తెలుస్తోంది. తిరుపతి నుంచి పవన్ కు విజయవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేల్లో తేలినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Nagababu in Vizag : బీజేపీ తో పొత్తు పై స్పందించిన నాగబాబు..

నాగబాబు మాత్రం అనకాపల్లి నుంచి ఫిక్స్..

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్థానం కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా వెలువరించనప్పటికీ పార్టీ వర్గాల్లో మాత్రం ఇది ఖరారైన విషయమని అంటున్నారు. నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే నాగబాబు అనకాపల్లికి షిఫ్ట్ అయ్యారని, ఎన్నికల కార్యాచరణ కూడా మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది.

Pawan Kalyan Contest from Kakinada? : ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఎక్కడినుండో తెలుసా..!


Spread the love
Tags: JanasenaJanasena 2024 ElectionsJanasena Chief Pawan KalyanJanasena Next ElectionsNagababuNagababu Anakapalle ConstituencyNagababu Anakapalle Constituency ConfirmNagababu Constituency FixedNagababu in AP Assembly ElectionsNagababu in AP ElectionsPawan Kalyan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.