Kavya Kalyan Ram – ఆడిషన్స్ కి వెళితే అలా ఉన్నావంటూ అవమానించారు…
Kavya Kalyan Ram – చాలామంది ఎలాగైనా తమ ప్రతిభను నిరూపించుకొని ఇండస్ట్రీలో రాణించాలని ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ ఈ క్రమంలో తాము సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కున్న సంఘటనల కారణంగా కెరియర్ని అర్ధాంతరంగా మధ్యలోనే ముగించేసుకొని ఇతర రంగాలలో సెటిల్ అయిన వాళ్లు కూడా లేకపోలేదు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ అలాగే క్యాస్టింగ్ కౌచ్ విషయాలపై తెలుగు యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.
సూటిపోటి మాటలతో అవమానించారు:
అందరిలాగే తాను కూడా సినిమా ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకొని సిల్వర్ స్క్రీన్ పై తనను తాను చూసుకోవాలని ఎన్నో ఆశలతో, కలలతో ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. కానీ ఆడిషన్స్ కి వెళ్ళిన సమయంలో కొందరు తనని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో కొందరైతే ఏకంగా తన శరీరాకృతిపై కామెంట్లు చేస్తూ మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడారని కూడా వాపోయింది. కానీ తాను మాత్రం ఎప్పుడూ కూడా ఇలాంటి సూటిపోటి మాటలు విని నిరాశ చెందలేదని ఒకరకంగా చెప్పాలంటే తనని అవమానించిన వారి కారణంగానే తనలో మరింత పట్టుదల పెరిగిందని తెలిపింది.
Balagam Movie : కథా బలమే బలగానికి బలం..
Kavya Thapar Hot Pics : కుర్రాళ్ళ హర్ట్ బీట్ పెంచేస్తున్న కావ్య థాపర్..

టాలెంట్ ఉంటె ఆఫర్లు వస్తాయి:
అలాగే అవకాశాల విషయంలో పట్టు విడవకుండా ప్రయత్నించానని తెలిపింది. అలాగే మనలో ఉన్నటువంటి టాలెంట్ సినిమా ఇండస్ట్రీలో మన పొజిషన్లో నిర్ణయిస్తుంది, అంతేతప్ప శరీరాకృతి లేదంటే ఇతర అంశాలు నిర్ణయించవని తెలిపింది. అలాగే టాలెంట్ ఉంటే ఎప్పటికైనా అవకాశాలు దక్కించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కూడా నూతన నటినటులకు సూచించింది.
Balagam Movie : అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న బలగం..
Trisha Leo Remuneration : విజయ్ లియో మూవీకి సౌత్ క్వీన్ త్రిష రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?
కావ్య కళ్యాణ్ రామ్ కెరియర్:
ఈ విషయం ఇలా ఉండగా నటి కావ్య కళ్యాణ్ చిన్నప్పుడు ప్రముఖ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత రెండు, మూడు చిత్రాలలో కనిపించినప్పటికీ మళ్లీ సినిమాల్లో నటించలేదు. కానీ ఇటీవలే ప్రముఖ కమీడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రంలో హీరో మరదలు పాత్రలో నటించి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అవడంతో పాటు దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది. కాగా ప్రస్తుతం కావ్య కళ్యాణ్ కి సినిమా ఆఫర్లు బాగానే క్యూ కడుతున్నట్లు సమాచారం.