Janasena Seats Confirmed : కొలిక్కి వచ్చిన పొత్తు చర్చలు, జనసేనకు ఇచ్చే సీట్లు ఖరారైనట్లే!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో కలిసి కట్టుగా వెళ్లి రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవాలని భావిస్తున్న టీడీపీ – జనసేన.. తమతో బిజెపిని కలుపుకోవాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమిపై కసరత్తు చేస్తున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నా మాదిరిగా ఉమ్మడిగా వైసీపీ ఎదుర్కోవాలని భావిస్తున్నారు.
నాగబాబు పోటీ అక్కడి నుంచే.. మరి పవన్ కల్యాణ్ సంగతేంటి?
ఎట్టకేలకు ఖరారు అయిన సీట్ల పంపకాలు
అయితే ఇప్పుడీ పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. టీడీపీ-జనసేన-బిజెపి కూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఎట్టకేలకు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మూడు పార్టీల మహా కూటమి ఏర్పాటు దాదాపుగా ఖాయమైనట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు.
AP Elections 2024 : రాజకీయ పార్టీలలో బిగుస్తున్న ‘సీటు’ముడి..!!
జనసేన-బిజెపిలకు కలిపి 50 అసెంబ్లీ సీట్లు, 10 లోక్సభ స్థానాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కలిసి ఉమ్మడిగా ఈ నెల 21వ తేదీన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని, మూడు పార్టీల కలయికతో మహాకూటమిని ప్రకటిస్తారని సమాచారం. పొత్తులో భాగంగా జనసేన-బిజెపి లకు కలిపి 50 అసెంబ్లీ సీట్లు, 10 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది.
నాగబాబు పోటీ అక్కడి నుంచే.. మరి పవన్ కల్యాణ్ సంగతేంటి?
Janasena Seats Confirmed : 4 ఎంపీ, 50 ఎమ్మెల్యే సీట్లు
బిజెపికి అసెంబ్లీ కంటే కూడా పార్లమెంటు స్థానాలే కీలకం కావడం, అలాగే జనసేనకు పార్లమెంటు స్థానాల కంటే అసెంబ్లీ స్థానాలే కీలకం కావడంతో ఆయా పార్టీలకు సీట్ల సర్దుబాటు ఉండనుంది. 10లో 6 పార్లమెంట్ స్థానాల్లో బిజెపి పోటీ చేసే అవకాశం ఉంది. 50 లో 10 అసెంబ్లీ స్థానాలను మాత్రమే బిజెపి అడుగుతున్నట్లు సమాచారం. 4 పార్లమెంటు స్థానాల్లో, 40 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Chandrababu Naidu – YS Jagan : జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత పట్టుదల..?
భీమవరం, గాజువాక స్థానాల నుంచి పవన్ పోటీ
మరోవైపు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ స్థానం జనసేనకే కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గాజువాక ప్రాంతంలో జనసేనకు మంచి పట్టు కూడా ఉందని, ఈ స్థానం జనసేనకు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను భీమవరంతో పాటు, గాజువాక నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకులు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పవన్, అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Roja Comments on Sharmila : చెల్లి షర్మిల మీదకు రోజాను వదిలిన జగన్ రెడ్డి