Balagam Movie : ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ ఉండాలి, ఆ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తెరపై చూపించాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి సినిమానే ‘బలగం’. పట్టణాల్లో కంటే పల్లెటూరుల్లో ఉండే ప్రజల జీవన విధానం ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ వారి అలవాట్లు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. కుటుంబ సంబంధాలు మానవీయ కోణాన్ని పల్లె ప్రాంతాల్లో ఆచార సంప్రదాయాలను కలగలిపి తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంటుంది.
ఈ సినిమా ద్వారా మంచి మేసేజ్ ను కూడా అందించారు దర్శకుడు వేణు. ఈ సినిమా వరుస అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. అంతేకాదు ఇటీవల జరిగిన టిఎస్పీఎస్పీ నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలలో కూడా ‘బలగం’ సినిమా గురించి ప్రశ్న అడగడం విశేషం. అంతలా ఈ సినిమా ప్రభావం చూపింది. అందుకే రూ.3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 26 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి ఈ సినిమా తెరకెక్కించారు.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి ప్రయత్నంలోనే ఎవరూ ఊహించని హిట్ ను అందుకున్నారు వేణు. ఈ సినిమా మార్చి 3, 2023 న విడుదలై ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ మూవీకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడమే కాకుండా వరుస అవార్డుల పంట పండింది. ఇప్పటికీ ఈ సినిమాకు ఎక్కడో చోట ఏదొక అవార్డు వస్తూనే ఉంది. తాజాగా ఈ ‘బలగం’ మూవీ మరో అరుదైన ఘనతను సాధించింది.