• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Reviews

Nayakudu Movie Review : ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ ల ‘నాయకుడు’ మూవీ రివ్యూ & రేటింగ్..

R Tejaswi by R Tejaswi
July 14, 2023
in Reviews
0 0
0
Nayakudu Movie Review : ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ ల ‘నాయకుడు’ మూవీ రివ్యూ & రేటింగ్..
Spread the love

Nayakudu Movie Review : నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు

ఫోటోగ్రఫీ : తేని ఈశ్వర్
ఎడిటర్ : ఆర్కే సెల్వ
సంగీతం : ఏఆర్ రెహమాన్
నిర్మాణ సంస్థ : రెడ్ జెయింట్ మూవీస్
నిర్మాత : ఉదయనిధి స్టాలిన్
రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్
విడుదల తేదీ: జూలై 14, 2023

సమాజంలో దళితులు, తక్కువ జాతి మనుషులు ఎదుర్కొనే సమస్యలను కథాంశాలుగా సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. అతడి మునుపటి చిత్రాలైన “పెరియెరుమ్ పెరుమాళ్, కర్ణన్” ఈ తరహాలో తెరకెక్కిన చిత్రాలే. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మామన్నన్”. వడివేలు, ఉదయానిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని “నాయకుడు” పేరుతో తెలుగు ప్రేక్షకులకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ తమిళ పోలిటికల్ డ్రామాకు ఏమేరకు కనెక్ట్ అవ్వగలరు అనేది చూద్దాం..!!

కథ :
ఓ చిన్నపాటి కార్యకర్తగా మొదలుపెట్టి.. ఒక్కో మెట్టు కష్టపడి ఎక్కి, ఎమ్మెల్యే అవుతాడు తిమ్మరాజు (వడివేలు). ఎమ్మెల్యే కొడుకు అయినప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా పందుల వ్యాపారం చేస్తూ ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంటాడు అతడి కుమారుడు రఘువీర (ఉదయానిధి స్టాలిన్). ఈ తండ్రీకొడుకులిద్దరి మధ్య ఏర్పడిన రాజకీయ విబేధాల కారణంగా ఇద్దరి నడుమ మాటలు ఉండవు
కట్ చేస్తే.. లీల (కీర్తిసురేష్) నడిపే ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కోసం ఒక చోటు వెతుక్కుంటూ.. తన కాలేజ్ మేట్ అయిన వీర వద్దకు వస్తుంది.

RC16 Heroine : రామ్ చరణ్ RC16కు హీరోయిన్ ఫైనల్..

తాను డోజో నేర్పించే స్థలాన్నే కోచింగ్ సెంటర్ కు వాడుకోవాలని సూచిస్తాడు వీర. ఆ కోచింగ్ సెంటర్ పై కొందరు రౌడీలు దాడి చేయడంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. వీరన్ తనకు తెలియకుండానే ఆ జిల్లా పెద్ద మరియు కులం నాయకుడు అయిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్)తో తలపడతాడు. వీర-రత్నవేలు నడుమ యుద్ధంలో తిమ్మరాజు ఎలా నలిగిపోయాడు? చివరికి ఎవరు గెలిచారు? ఆ గెలుపు వెనుక జరిగిన విస్ఫోటం ఎటువంటిది? అనేది “నాయకుడు” కథాంశం.

రివ్యూ:
తమిళ దర్శకుల్లో మారి సెల్వరాజ్‌ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో కథ కంటే సన్నివేశాలు ఎక్కువగా మాట్లాడతాయి. మారి సెల్వరాజ్ గత రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభంలోనే రెండు సీన్లను సమాంతరంగా నడిపిస్తూ హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోకు పందులంటే చాలా ఇష్టం. దీని కారణంగా కొన్ని పందులను పెంచుకుంటూ ఉంటాడు.

Varahi VijayaYathra : అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు : పవన్ కళ్యాణ

మరోవైపు విలన్ కుక్కలను పెంచుతూ ఉంటాడు. తనకు వాటి మీద ప్రేమ ఉండదు. కేవలం రేసుల కోసం పెంచుతాడు. వాటిలో ఏదైనా రేసులో ఓడిపోతే దారుణంగా కొట్టి చంపడానికి కూడా వెనుకాడడు. ఇలా వారి ఐడియాలజీ మధ్య విభేదాలను కూడా సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించేస్తాడు. ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంలోనే అయిపోతుంది.

ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. మారి సెల్వరాజ్ మార్కు మాత్రం ఎక్కడా మిస్ కాదు. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటి ఇంట్రస్టింగ్ షాట్లు సినిమాలో చాలా ఉన్నాయి. సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పవచ్చు. ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మర్‌ను ఈ సీన్‌లో చూడవచ్చు.

Baby Movie Review : ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ రివ్యూ & రేటింగ్..

అలాగే క్లైమ్యాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. మనసు నిండా ఒక రకమైన సంతృప్తితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమాలో డైలాగ్స్ కూడా బలంగా రాశారు. ‘నిన్ను కూర్చోనివ్వకపోవడం నా అధికారం. నీ కొడుకుని కూర్చోమనడం నా రాజకీయం.’ అంటూ ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్ తన క్యారెక్టరైజేషన్, ఇంటెలిజెన్స్‌కు అద్దం పడుతుంది. ‘ఆయన కూర్చోలేదు సరే మీరు ఎందుకు కూర్చోమనలేదు?’ అని ఉదయనిధి స్టాలిన్ వేసే ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ఉదయనిధి స్టాలిన్ చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

తను ఎందుకు రెబల్ అయ్యాడు అనే విషయాన్ని చాలా చక్కగా, కన్విన్సింగ్‌గా మారి సెల్వరాజ్ ప్రెజెంట్ చేశారు. సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు పిల్లర్స్‌గా నిలిచాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.

నటీనటుల విషయానికి వస్తే..
వడివేలు ఈ సినిమాలో సర్‌ప్రయిజ్ ప్యాకేజ్. తమిళనాట వడివేలు కొన్ని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఉండవచ్చు. కానీ తెలుగువారికి వడివేలును ఇలా చూడటం ఒక కొత్తగా ఉంటుంది. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురు నిలిచే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది.

Deepika Padukone Net Worth : స్టార్ హీరోలను తలదన్నేల దీపికా ప‌దుకొనె సంపాదన..

సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత బాగా నటిస్తాడో అందరికీ తెలిసిందే. తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఇది కూడా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో తనకు లభించిన బెస్ట్ రోల్ ఇదే. కీర్తి సురేష్‌ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులందరూ తమ పరిధి మేరకు నటించారు.

రేటింగ్ : 2.75/5
ట్యాగ్ లైన్ : కొత్తదనం కోరుకునే వాళ్లకు నాయకుడు బెస్ట్ ఆప్షన్..

Mahesh Babu : సూపర్ స్టార్ తో వర్క్ చేయడం డ్రీమ్ అంటున్న యంగ్ బ్యూటీ..


Spread the love
Tags: AditiShankarAliaBhattBabyTheMovieFahadhFaasilKeerthySureshMahaveeruduMahaveeruduReviewNayakudu Movie ReviewNayakuduReviewNayakuduReviewinTeluguNayakuduTeluguReviewSaiPallaviVadiveluనాయకుడునాయకుడు రివ్యూ
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.