Apricots : అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వర్షాకాలం రాగానే ఈ పండ్లు దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇండియాలో ఈ పండ్లను బ్లాక్ బెర్రీ, బ్లాక్ ప్లం అని పిలుస్తుంటారు. అటవీ ప్రాంతంలోనే కాక ఇప్పుడు ఈ పండ్లను చాలామంది సాగు కూడా చేస్తున్నారు. ప్రపంచంలో కూడా ఈ పంటను సాగు చేయడం విశేషం.
రుచికి పుల్లగా, తీపిగా ఉండే ఈ పండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని,ఇన్ని కాదు. ఈ పండు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. అల్లనేరేడు పండులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, బి లవంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని సమతుల్యంలో ఉంచడానికి ఈ పండు ముందు వరుసలో ఉంటుంది.
ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించే అనేక పండ్లలో ఈ జామున్ ది ప్రథమ స్థానంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య నిపుణులు వర్షాకాలంలో తప్పకుండా ఈ పండ్లను తినమని సూచిస్తారు. వర్షాకాలంలో జామున్ తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు తెలుసుకుందాం..
★ ఈ పండు జీర్ణ సమస్యలను నయం చేయడంలో సహాయపడే శీతలకరణిగా పనిచేయడమే కాకా. వర్షాకాలంలో ప్రేగు కదలికలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.
★ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుముఖం పడుతుంది. అలాగే మధుమేహం లక్షణాలు కూడా తగ్గుతాయి.
★ జామూన్లో ఉండే అధిక ఫైబర్ చాలాసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి అతిగా తినకుండా నిరోధిస్తుంది. దానివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
★ అల్లనేరేడు పండులో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తం శుద్ధి గావింపబడుతుంది.
★ఈ పండులో లభించే విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచి, నోటి దుర్వాసనను నివారించడంలో కూడా సహాయపడతాయి.
★ఈ పండు తినడం వల్ల కిడ్నీలు, లంగ్స్ కూడా పాడవకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల విషయంలో ఈ పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అల్లనేరేడు పండ్లను ఆలస్యం చేయకుండా మీరు తినేయండి మరీ..