Benefits of Raw Mangoes : ఎండాకాలం వస్తుంది అంటేనే మామిడికాయల సీజన్ వస్తుంది. ఈ సీజన్ లో మామిడికాయలు రుచిని ప్రతిఒక్కరు ఆస్వాదిస్తారు. మామిడి పండ్లది ఒక రుచి అయితే పచ్చి మామిడికాయలది ఇంకో రుచి. రుచి అనే కాదు పచ్చిమామిడి కాయలతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
* పచ్చి మామిడికాయలతో జ్యూస్ చేసుకొని త్రాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
అంతేకాక మన శరీరంలోని మినరల్స్ ను బయటకు పోకుండా కాపాడుతుంది.
* పచ్చి మామిడికాయల ముక్కలను తినటం లేదా జ్యూస్ చేసుకొని త్రాగటం వలన జీర్ణ సంబంధిత వ్యాధులు అయిన డయేరియా, మలేరియా, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు పోతాయి.
* పచ్చి మామిడికాయలను తినటం వలన చిగుళ్లు, దంతాలు బలంగా అవుతాయి. చిగుళ్ల నుండి రక్తస్రావం అయ్యే వారికి పచ్చి మామిడికాయలు మంచి ఔషధం.
* పచ్చి మామిడికాయలో నియాసిన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకాలను కూడా తొలగించి గుండె వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుంది.
* విటమిన్ సి లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధికి పచ్చి మామిడికాయల్లో ఉండే విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది.
* పచ్చి మామిడి కాయలు మన ఒంట్లోని లివర్ ని కూడా బాగా శుభ్రం చేస్తాయి.
* మధుమేహం ఉన్నవారు కూడా పచ్చి మామిడి తినవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.
* పచ్చి మామిడి బరువు తగ్గటానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
* ఎసిడిటితో బాధపడే వాళ్ళు పచ్చి మామిడికాయ ముక్కను తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* పచ్చి మామిడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* పచ్చిమామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, వృద్దాప్య లక్షణాలను నివారిస్తాయి.
* గర్భధారణ సమయంలో ప్రతి మహిళకు ఉదయాన్నే వికారంగా, నీరసంగా ఉంటుంది. అలాంటి వారు చిన్న మామిడికాయ ముక్కను తింటే ఉపశమనం కలుగుతుంది.
Discussion about this post