Janhvi Kapoor : మహేంద్రుడితో అతిలోకసుందరి కూతురు.. అంబానీ పెళ్ళిలో జాన్వీ కపూర్ సొగసు చూడాల్సిందే
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంబరాన్ని అంటే సంబరాలతో జరుగుతోంది. దాదాపు 1000 కోట్లు పెళ్ళికి ఖర్చు చేస్తున్నారట. ఇండియన్ సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకకి హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా బాలీవడ్ తారలు పెళ్లి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అయితే ఘాటైన సొగసుతో.. మతిపోగోట్టే డ్రెస్సులతో పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. వివిధ అవుట్ ఫిట్స్ లో జాన్వీ మేరువులు మెరిపిస్తోంది.
ముఖ్యంగా జాన్వీ కపూర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తో కలసి దిగిన ఫోటో ఫ్యాన్స్ ని ఆకర్షిస్తోంది. అంబానీ పెళ్లి వేడుకలో జాన్వీ కపూర్ సొగసు చూడాల్సిందే. విజువల్ ఫీస్ట్ లాగా ఉన్న ఫొటోస్ పై ఓ లుక్కేయండి.