National Cancer Awareness Day : క్యాన్సర్ ఈ పేరు వింటేనే మనకు ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య రోజు,రోజుకి పెరిగిపోతుంది. కొన్ని లెక్కల ప్రకారం 2018లో 6.5 కోట్ల మంది క్యాన్సర్ పరీక్షలు చేసుకోగా, అందులో 1.6 కోట్ల మందికి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ సంఖ్య కాస్త 2017కి 39 వేలు ఎక్కువగా పెరిగింది. దీన్ని బట్టి చూస్తే క్యాన్సర్ భూతం ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనకు అర్థమవుతుంది.
ముఖ్యంగా క్యాన్సర్ కారకాలలో గర్భాశయం, రొమ్ము, నోటి క్యాన్సర్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు క్యాన్సర్ల పేరే ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ప్రజల్లో సరైన అవగాహన కల్పించకపోవడమే, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఈ విషయంలో మన దేశం వెనుకబడి ఉందని చెప్పవచ్చు.
మరి క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..
★ పొగాకు : పొగాకును వివిధ రూపాల్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. క్యాన్సర్ రావడానికి ఇది ముఖ్య కారణం. పొగాకు కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
★ ఆహారం : ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఓపెన్ మీట్, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటిని అసలు తీసుకోకూడదు. ప్రతిరోజు ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను చక్కెర ఎక్కువగా ఆహారాన్ని ముట్టవద్దు. అలాగే మాంసాన్ని కూడా తగ్గిస్తే మంచిది.
★ బరువు : ఉబకాయం అంటేనే అనేక రకాల వ్యాధులను తెచ్చిపెట్టేది. వాటిల్లో క్యాన్సర్ కూడా ఒకటి. బరువును నియంత్రించుకోవడంలో శ్రద్ధ వహించాలి. అనారోగ్యకరమైన ఆహారాని కి దూరంగా ఉండాలి .ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి.
★ టీకాలు : కొన్ని వ్యాధులు క్యాన్సర్ కి కారకాలు. ముఖ్యంగా వాటిల్లో హెపటైటిస్ బి, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్పీవీ) ప్రధానమైనవి ఈ వ్యాధులకు వ్యాక్సిన్లు మార్కెట్లో మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈ వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు