Precautions to Prevent Paralysis : ఈరోజుల్లో చాలా రకాల అనారోగ్య సమస్యలను చూస్తుంటాము. ఏ నిమిషం ఎటువంటి సమస్య వచ్చి ప్రాణప్రాయం ఉంటుందో కూడా, ఊహించలేని విధంగా జీవన విధానంలో ఉన్నాము. అయితే ముఖ్యంగా గుండెపోటుతో సమానంగా ఉన్నటువంటి మరొక అనారోగ్య సమస్య గురించి తెలుసుకుందాం. అదే పెరాలసిస్. పెరాలసిస్ కూడా అకస్మాత్తుగా ఒక్కోసారి అటాక్ చేస్తుంది.
కానీ దానిని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలను మన బాడీలో జరుగుతా ఉంటాయి. వాటిని గమనిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పెరాలసిస్ వచ్చినవారిలో కొందరికి రెండు కాళ్లు, రెండు చేతులు పడిపోతాయి. నోరు కూడా పడిపోతుంది. మరికొందరికి ఏమో ఒక కాలు, ఒక చేయి మాత్రమే పడిపోతుంది. అయితే ఇది చాలా మొండి జబ్బు.
ఎందుకంటే ఇది ఒకసారి వస్తే అది జీవితాంతం మంచానికి పరిమితం చేస్తుంది. అందుకే ఈ జబ్బు పేరు వింటేనే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. పక్షవాతం వస్తే మనిషి సహజంగానే చేసుకునే పనులు కూడా చేసుకోలేరు. దీని నుంచి 20% మంది కోలుకుంటారు. మిగతా వారందరూ కూడా జీవితాంతం ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటున్నారు.
ఈ జబ్బు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం రాకుండా ఉండాలంటే ముందుగా వచ్చే లక్షణాలపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇంతకుముందు రోజులలో పక్షవాతం కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 15 ఏళ్లు నిండని వారికి కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి కారణం మన జీవనశైలీలో వచ్చినటువంటి మార్పులు తెలుసుకుందాం.
ఉప్పు
ముందుగా ఉప్పును ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పు రక్తాన్ని చిక్కపరిచే గుణం కలిగి ఉంటుంది. బీపీ రావడానికి కూడా ఉప్పు ప్రధాన కారణం. సాధారణంగా చూస్తే ఏ దేశాలు ఉప్పుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారో ఆ దేశాల్లో పెరాలసిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మనం రోజులో కేవలం1.5 గ్రాములు ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి ఉప్పును తింటే మాత్రం ప్రమాదమే.
తెల్లటి ఆహార పదార్థాలు
రెండవది తెల్లటి ఆహార పదార్థాలు అంటే మైదా పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు అసలు తినకూడదు. అలాగే ఎందుకంటే వీటిల్లో కార్బోహైడేట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణమై కొవ్వుగా మారుతాయి. అలాగే ఎల్.డి.ఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. దీని ద్వారా రక్తం ప్రసరణ జరగక పెరాలసిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
హై బీపీ
మూడోదిగా హై బీపీ వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెరాలసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే పెరలసిస్ నుంచి కాస్తైన బయటపడవచ్చు.