Sai Dharam Tej : ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మా హీరో గ్రేట్ అంటే.. మా హీరో గ్రేట్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు, కామెంట్లతో విరుచుకుపడుతుంటారు. ఒక్కసారి ది ఆన్లైన్ నుంచి హద్దులు దాటి డైరెక్ట్ గా దాడులు చేసుకునే వరకు వెళ్తుంది. అప్పుడు స్వయంగా హీరోనే రంగంలోకి దిగి గొడవలు అభిమానుల మధ్యే కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది.
సినిమాల వరకే మా మధ్య పోటీ ఉంటుంది కానీ, మేము ఎప్పటికీ కలిసే ఉంటామని క్లారిటీ ఇస్తుంటారు. దీన్ని మరోసారి నిరూపించాడు మంచు మనోజ్. ఇటీవలే వివాహం చేసుకున్న మంచు హీరో సుప్రీం హీరోకి గ్రాండ్ గా బిర్యానీ పార్టీ ఇచ్చాడు. తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష గ్రాండ్ సక్సెస్ కావడంతో తన ఇంట్లోనే ప్రత్యేకంగా బిర్యానీ తయారు చేయించి మరీ మెగా హీరోకు పార్టీ ఇచ్చాడు మనోజ్. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారాయి.
కార్తీక్ దండు డైరెక్షన్ లో వచ్చిన విరూపక్ష వంద కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది. మొదట తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ఇటీవల తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి వినోదాయా సీతమ్ రిమేక్ లో నటిస్తుండగా.. మనోజ్ వాట్ ది ఫిష్ అనే సినిమాతో పాటు మనం మనం బరంపురం అనే మూవీ కూడా చేస్తున్నాడు.
https://www.instagram.com/p/CsELA6XyTDD/?igshid=NTc4MTIwNjQ2YQ==
Discussion about this post