Benefits with Oats : ఉరుకుల, పరుగుల జీవితంలో ఫాస్ట్ గా అయ్యే ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్ లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. ఓట్స్ ని ఏ రకంగా, ఏ సమయంలో తింటే మనకు కావలసిన ప్రయోజనాలు చేకూర్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఈ ఓట్స్ పెద్దలకే కాకుండా పిల్లలు కూడా ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. ఓట్స్ వల్ల పీచు పదార్థము ,విటమిన్లు బి 1,బి 2 సి ,కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు మెగ్నీషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్సు, మాంగనీస్ ఇంకా ఫాస్ఫరస్ వంటి ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి పుష్కలంగా అందుతాయి.
అలాగే ఓట్స్ తీసుకుంటే బిపి ,మధుమేహాలకు కూడా అరికట్టవచ్చు. ఓట్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు అలాగే షుగర్ కూడా అదుపులో ఉంటుంది. ఇంకా ఓట్స్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మంచి డైట్ ప్లాన్. క్యాన్సర్, ఆస్తమా, చర్మ సమస్యలు కూడా ఓట్స్ తింటే దరిచేరవు. శరీరంలో ఉన్న నీరసాన్ని కూడా ఓట్స్ తగ్గిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ఓట్స్ ని ఆలస్యం చేయకుండా మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి మరి.