Child Care Tips : చిన్నపిల్లలకు జ్వరం రాగానే వెంటనే తగ్గించడానికి తల్లులు ఆరాటపడుతూ ఉంటారు. ఆ క్రమంలో వారికి త్వరగా నయం అయిపోవాలి అని ఎక్కువ మోతాదులో తెలియకుండానే యాంటీబయోటిక్స్ ని వాడేస్తుంటారు. కానీ వీటివల్ల పిల్లలకు సమస్య వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి యాంటీబయాటిక్స్ ని ఎప్పుడు వాడాలి.. అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకి ఇన్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది..? ఇన్ఫెక్షన్ అనేది క్రిములవల్ల సోకుతుంది. సూక్ష్మక్రిములు ఉన్న వస్తువులను మనం తాకడం వల్ల, ముక్కు లేదా నోరు,కళ్ళకు ఇన్ఫెక్షన్స్ సోకుతుంది. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ ఇతరుల నుండి కూడా సంక్రమించవచ్చు. బ్యాక్టీరియా, వైరస్ ల నుండి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. జలుబు, ఫ్లూ వల్ల ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది.
ఒకవేళ బ్యాక్టీరియాలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే దానివల్ల గొంతు నొప్పి, చర్మవ్యాధులు, మూత్రశయా ఇన్ఫెక్షన్లు, చెవి ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి..యాంటీబయాటిక్స్ వల్ల ఉపయోగం ఏమిటి..? బ్యాక్టీరియాను చంపడంలో యాంటీబయటిక్స్ చురుగ్గా పనిచేస్తాయి. బ్యాక్టీరియా పెరుగుదల, పునరుత్పత్తిని ఇవి నిరోధిస్తాయి. మీ బిడ్డకు యాంటీబయాటిక్
అవసరమైతే వైద్యుడి సలహాతో మాత్రమే యాంటీబయటిక్స్ ని వాడాలి. పిల్లలకి జలుబు లేదా జ్వరం వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. అయితే ఈ యాంటీబయాటిక్స్ అవసరమా.. లేదా.. అనేది వైద్యుల సలహా మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మీ బిడ్డ అనారోగ్యంతో ఉంటే ముందుగా ఆస్పత్రికి తీసుకువెళ్లడం చేయాలి. కొందరు ఇంట్లో ఉన్న పాత సిరప్ లని పిల్లలకి వాడేస్తూ ఉంటారు.
అలా చేయడం చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ముందుగా మీ బిడ్డకు రోగనిరోధక శక్తి స్థాయి ఎలా ఉందో మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ వంటి ఇమ్యునైజేషన్లు కొన్ని వ్యాధులను నిరోధించడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. న్యుమోకాకల్ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ టీకాలు ఇన్ఫ్లుఎంజా, చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వైరస్ లను నిరోధిస్తాయి.