Cholesterol Reduced Fruits : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీనివల్ల గుండెపోటు, లేక స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే బరువు సమస్య కూడా పెరుగుతుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా, చెడు కొలెస్ట్రాల్ తగ్గేలాగా చూసుకోవాలి. అలా ఉండాలంటే ఫైబర్స్ సమృద్ధిగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఈ పండ్లు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండే పండ్లు గుండెపోటు ధమనిని అడ్డుపడడం లేక, ఇతర గుండా సమస్యల నుంచి రక్షిస్తాయి. ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్
ఆపిల్ కొలెస్ట్రాల్‌ను చాలా బాగా తగ్గిస్తుంది. ఆపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా మనకు లభించి, పాలిఫైనల్స్ కలిగి ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మనకు హెల్ప్ అవుతాయి. కాబట్టి రోజూ ఒక ఆపిల్ తినడం మంచిది.
అరటి పండు
అరటిపండులో ఉండే ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్ అలాగే రక్తపోటు స్థాయిని తగ్గిస్థాయి. అరటిపండు లో ఉండే ఫైబర్ మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడడమే కాక, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పైనాపిల్
పైనాపిల్ లో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉండి, పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ ధమనులలోని కొలెస్ట్రాల్ నిక్షేపాలను విచ్ఛిన్నం చేసి, ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి సహాయం చేస్తుంది. పైనాపిల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయం చేస్తుంది.