Dream Astrology : ప్రతి మనిషికి నిద్రలో కలలు రావడం సహజం. అయితే ఈ కలలు మన నిజజీవితంలో జరిగే కొన్ని సందర్భాలకు సూచికగా ఉంటాయి. ఏ కలలు దేనికి సంకేతం, కలలో ఏం కనిపిస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. కొన్ని కలలు మన మనసుకు సంతోషాన్ని ఇస్తే మరికొన్ని కలలు పీడ కలలుగా మిగిలిపోతాయి. వాటివల్ల మన జీవితంలో దుఃఖం నిండిపోతుంది.
పీడ కలలు వచ్చినప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. వాటి వల్ల ఏదైనా సమస్య వస్తుందేమో అని భయపడిపోతారు. అయితే మామిడి పండ్లు కలలోకి రావడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రీమ్ సైన్స్ నిపుణులు ఏమంటున్నారంటే కొన్ని చెడు, భయానక కలలు కూడా మనకు శుభప్రదమైనవే అని చెప్తున్నారు.
అయితే మామిడి పండ్లు కలలోకి వస్తే అది చాలా ప్రత్యేకమైన కల అనీ తెలియజేస్తున్నారూ. మామిడికాయలను కోస్తున్నట్టు కల వస్తే మీ జీవితంలో మంచి జరగబోతుంది అనేది సంకేతం. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని దాని అర్థం. మామిడి పండ్లు కలలోకి వస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారని, అలాగే ఉద్యోగం కోసం వెతుకులాడే వారూ శుభవార్త వింటారని సూచిక.
ఒకవేళ మీ కలలో పచ్చిమామిడి పనులు కనుక వస్తే మీ అదృష్టం మారబోతుంది అని అర్థం. పశ్చిమామిడి పండ్లు తిన్నట్టుగా కల వస్తే మీకు త్వరలోనే ధనలక్ష్మి అందుతుందని అర్థం. మామిడి పండ్లను తింటున్నట్టుగా కల వస్తే మీకు ఆకస్మిక ధన లాభం చేకూరుతుందని మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని సూచిక.