Effects of Sneezing : మానవ జీవితంలో “తుమ్ము” అనేది చాలా సహజ ప్రక్రియ. అయితే ఈ తుమ్మడం వల్ల అశుభమని కొందరు భావిస్తారు. అన్ని తుమ్ములు చెడు శకునానికి నిదర్శనాలు మాత్రం కావు. కొన్ని తుమ్ములు మంచి జరగడానికి కూడా సంకేతాలుగా చెబుతున్నారు పండితులు. అయితే తుమ్మడం ఎప్పుడు అరిష్టమో, ఎప్పుడు మంచిదో ఇప్పుడు చూద్దాం.
పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే ,ఆ వెళ్లే పని జరగదు అని చాలామంది విశ్వసిస్తారు. అలాంటప్పుడు వెళ్లే పనిని వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఒక్కసారి తుమ్మితే, ఆ తుమ్మును పరిగణలోనికి తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తుమ్మితే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
శుభకార్యానికి వెళ్లే ముందు ఎవరైనా వెనకనుండి తుమ్మితే మీకు అది శుభ సూచకమనే భావించాలి. ఇంట్లో పాలు మరిగించేటప్పుడు తుమ్మడం చాలా అరిష్టమని పెద్దలు చెప్తుంటారు. ఈ అరిష్టము మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తుమ్ము మానవులకి ఎలా సహజంగా వస్తుందో, జంతువులకు కూడా అలాగే వస్తుంది.
అయితే ఏ జంతువు తుమ్ము మనకు మంచిది అనేది తెలుసుకుందాం. “ఆవు” తుమ్ము చాలా మంచిది. ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు ఆవు తుమ్మితే ఖచ్చితంగా దాని ప్రభావం మనకు శుభాన్ని కలిగించి, విజయాన్ని అందిస్తుంది. బయటికి వెళ్లేముందు “కుక్క” ఒకటికంటే ఎక్కువసార్లు తుమ్మితే అది చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు.
అలాగే “ఏనుగు” తుమ్ము విన్నట్లయితే మన జీవితంలో చాలా సంతోషకరమైన వార్తలు వినడం, అదృష్టం మన జీవితాన్ని వరించడం లాంటివి జరుగుతాయి.