Foods Not to Eat with Tea : ఉదయం లేవగానే చాలామందికి టీ లేనిది ఒక్క అడుగు కూడా ముందు కదలదు. అంతలా టీ కి అలవాటు అయిపోతారు. ఈ టీ లలో ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి. మనకు బయట అందుబాటులో కూడా ఉంటాయి. అయితే టీ లో ఉండే కెఫెన్ మాత్రం ప్రమాదకరమనే చెప్పాలి. ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ, అత్యధికంగా టీ తాగితే మాత్రం శరీరంలోకి వెళ్లి అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది.
అయితే టీ తో కలిపి తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి..? అవి తినడం వల్ల కలిగే నష్టాలు.. ఇప్పుడు తెలుసుకుందాం..టీ తాగిన తర్వాత గంట వరకు ఎలాంటి పదార్థాలను తీసుకోవద్దు. అలాగే టీ లో నిమ్మరసాన్ని అస్సలు వాడకూడదు. నిమ్మరసం వాడితే టీ కాస్త ఆమ్లంగా మారుతుంది. అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది.
అలాగే టీ తాగిన వెంటనే పండ్లు అస్సలు తినకూడదు. కనీసం గంట గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. టీ తాగిన వెంటనే పెరుగు తినకూడదు. అలా తింటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటితోపాటు టీ తాగిన వెంటనే చల్లటి ఐస్ క్రీమ్ జోలికి అసలు వెళ్ళకూడదు. అలా చేస్తే గొంతు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.