Health Problems Due to Non-veg : చాలామందిలో మాంసాహారప్రియలు ఎక్కువగా ఉంటారు. అతిగా మాంసాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యులు. అధికంగా మాంసాహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.. ఎక్కువగా మాంసం తినే వాళ్ళలో కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే జీర్ణం వ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది. తక్కువ ఫైబర్ కారణంగా పేగులలో ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా ఏర్పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు.
అధికంగా మాంసాహారం తినడం వల్ల కడుపులో ఆమ్లం పెరిగి ఎముకలు, కీళ్లలో నొప్పి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మాంసాహారం ఎక్కువగా తినాలనుకునేవారు దానితోపాటుగా తాజా కూరగాయలను పండ్లను తీసుకోవడం మంచిది అని వైద్యం పులులు తెలియజేస్తున్నారు ఎక్కువగా తింటే అది శరీరానికి ప్రోటీన్ తో పాటు ఫైబర్ ని కూడా అందిస్తుంది ఈ విషయాన్ని మాంసాహారం తినే వారిపై ప్రత్యేకంగా పరిశోధన జరిపి వెల్లడించారు
ఇలా మాంసాన్ని తినేవారిలో ముఖ్యంగా మూడు శాతం మరణాలు సంభవించాయని, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు నాలుగు శాతం ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. అయితే చేపలు తినేవారికి గుండెజబ్బుల మరణానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. ధూమపానానికి, మధ్యపానానికి దూరంగా ఉండే వాళ్లకు వచ్చే సమస్యలు తక్కువ.