Liver – Alcohol : మానవ శరీరంలో అన్ని అవయవాలు సరైన క్రమంలో పనిచేస్తేనే మానవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాడు. అవయవాల పనితీరులో ఏ చిన్న మార్పు జరిగిన అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ కాలేయం దెబ్బతింటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాము.
మనదేశంలో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇందులో లివర్ సిర్రోసిన్ వ్యాధి కేసులు అధికంగా రావడం గమనార్హం. ఇది ఎక్కువగా ఆల్కహాల్ తాగే వారిలో వస్తుందని అనుకుంటారు. నిజానికి ఈ వ్యాధి ఆల్కహాల్ ప్రభావంతో మాత్రమే రాదు. ఆల్కహాల్ అలవాటు లేని వారిలో కూడా ఈ వ్యాధి సక్రమిస్తుంది.
మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం కాలేయం పని. ఆల్కహాల్ తాగే అలవాటు లేని వారిలో ఒకవేళ కాలేయం సమస్య వచ్చింది అంటే దానర్థం వారి శరీరంలో ఆహార నియమాలు సరిగా లేవని. అలాగే మధుమేహం, హైపోథైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారిలో, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్నవారు, హెపటైటిస్ సి వంటి సమస్యలతో బాధపడే వారిలో కూడా ఈ లివర్ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య చివరకు లివర్ సిర్రోసిక్ దారితీస్తుంది.
ఈ లివర్స్ సిరిసిన్ సమస్య వస్తే మాత్రం కాలేయం గట్టి పడిపోతుంది. మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకోవాలంటే అది చాలా కష్టం. కాలేయ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ లేని వారిలో కాలేయం త్వరగా పాడవుతుంది. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలి.
అలాగే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి అస్సలు తినకూడదు. వీటివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి కాలేయం దెబ్బతింటుంది. 40 సంవత్సరాలు దాటిన వారు ప్రతి సంవత్సరం కాలేయ పనితీరును లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్, మధుమేహ పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు కూడా కచ్చితంగా చేయించుకోవాలి.
ముఖ్యంగా కూరగాయలు, పండ్లు తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం ,మైదా పిండికి దూరంగా ఉండడం మంచిది. తినే ఆహారంలో అవిస గింజలు, వాల్ నట్స్, చేపలు, పొట్టు తీయని పప్పులు అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. గ్రీన్ టీ అలవాటు చేసుకుని రోజుకు రెండుసార్లు తాగితే మంచిది. అలాగే పసుపు మనం తినే ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలాంటి కొన్ని ఆహార నియమాలను పాటించి కాలేయాన్ని పాడవకుండా కాపాడుకోవచ్చు.