Mint Beauty Tips : పుదీనా ఆకులు మంచి సుగంధ పరిమాలాన్ని ఇస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా వంటలలో వాడుతూ ఉంటాం. కానీ పుదీనాను చర్మ సౌందర్యం కోసం, గాయాలను మాన్పించడంలో కూడా వాడుతారు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం పుదీనాను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది మొటిమలు, నల్లమచ్చలు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా కూడా ఆ సమస్య నుంచి బయటపడడం కష్టతరంగా ఉంటుంది. కానీ అటువంటి మొండి మచ్చలను, మొటిమలను తొలగించడానికి పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుంది.
పుదీనాలో సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఏ చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా జిడ్డు చర్మాన్ని నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి పుదీనా పేస్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా ఆకులను పేస్టులాగా చేసి 15 నిమిషాల పాటు ముఖంపై అప్లై చేసి ఉంచాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మొటిమల సమస్య నుంచి మీరు బయటపడవచ్చు.
పుదీనా ఆకులు యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల అవి ముఖంపై ఉన్నటువంటి నల్ల మచ్చలు, గీతలను తగ్గిస్తాయి. అలాగే సూర్యుని కిరణాల వల్ల చర్మం కమీలిపోతూ ఉంటుంది. ఆ సమస్య నుంచి కూడా ఈ ఆకులు చర్మాన్ని రక్షించి, చర్మం కాంతివంతంగా మెరిసేలాగా దోహదపడతాయి.
పుదీనా ఆకుల్లోని పోషకాలు ఆస్ట్రిజెంట్గా పనిచేసి చర్మంపై రంధ్రాల నుంచి మురికిని తొలగిస్తాయి. చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. పుదీనా ఆకులను డార్క్ సర్కిల్స్ మీద రాయడం వల్ల వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి.